NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

TDP Leaders Protest: టీడీపీ అభ్యర్ధుల తుది జాబితాను ఇవేళ ప్రకటించింది. అయితే పలువురు ఆశావహులకు టికెట్ దగ్గకపోవడంతో పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆశిస్తుండగా, పార్టీ అధిష్టానం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించింది. దీంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్బన్ పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రభాకర్ చౌదరి వర్గీయులు చేరుకుని కంప్యూటర్, పర్నిచర్ ను ధ్వంసం చేశారు. పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కార్యాలయంలోని ఇతర సామాగ్రిని బయట వేసి నిప్పు అంటించారు. అర్బన్ టికెట్లను రూ.30 కోట్లకు అమ్ముకున్నారని చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపణలు చేశారు. కార్యాలయ  అద్దాలు ధ్వంసం చేశారు. చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

కాగా, నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళా కార్యకర్త  స్పృహ  కోల్పోగా, సహచర కార్యకర్తలు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గడిచిన అయిదు  సంవత్సరాలుగా ప్రభాకర్ చౌదరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టుకున్నారని పేర్కొన్నారు. దగ్గుపాటి ప్రసాద్ పార్టీ కార్యక్రమాలు చేయకపోయినా టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రభాకర్ చౌదరి వర్గీయులు  ప్రశ్నించారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై ప్రభాకర్ చౌదరి తీవ్రంగా స్పందించారు. కార్యకర్తలతో సమావేశం నిర్వహించి రేపు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

అలానే గుంతకల్లులోనూ తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేశారు. గుంతకల్లు అసెంబ్లీ టీడీపీ టికెట్ ను ఇటీవలే పార్టీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం కు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి జితేందర్ గౌడ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు.

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?