NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru March 29 2024 Episode 173: అందరికీ కొబ్బరి చిప్పలు తినిపించిన చంగయ్య, దొంగను పట్టుకున్న గంగ..

Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights

Mamagaru March 29 2024 Episode 173:  కొబ్బరి చిప్పలో ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయో మీకేం తెలుసురా అని చంగయ్య చెప్పడం మొదలు పెడతాడు. నాన్న ఆపుతావా ఈ ప్రపంచంలో కొబ్బరి చిప్పలు తప్ప ఇంకేమీ లేవు అన్నంత గొప్పగా చెప్తున్నావ్ ఇప్పుడు ఆ కొబ్బరి చిప్పలతో టిఫిన్ ఎలా చేస్తాం నాన్న అవి ఎలా సరిపోతాయి అని పాండురంగ అంటాడు. పాండురంగ కొబ్బరి తింటే చాలా బలం ఉంటుంది రా ఒకటి కాపోతే మనిషికి రెండు తినండి  అని కొబ్బరి చిప్పలు అందరికీ ఇస్తాడు చంగయ్య. మామగారు అసలు ఈ కొబ్బరి చిప్పలు ఎక్కడ తెచ్చారు అని శ్రీలక్ష్మి అడుగుతుంది. అదేంటమ్మా అలా అడిగావు భద్రాచలం వెళ్లి రామాలయం ఎక్కడ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అలాగే కొబ్బరికాయలు ఎక్కడ దొరుకుతాయి నీకు తెలియదా అని చంగయ్య అంటాడు. అందరూ కొబ్బరి తింటూ ఉంటారు. ఇంతలో శ్రీలక్ష్మి కి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడి శ్రీలక్ష్మి మామగారు మా నాన్నకి ఒంట్లో బాగోలేదు అంట నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని అంటుంది. వాళ్ల నాన్నకు ఒంట్లో బాగోలేదంట వెళ్లనివ్వండి అని దేవమ్మ అనడంతో శ్రీ లక్ష్మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights
Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights

గంగాధర్  గాంధీనగర్ కాలనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ ఇల్లు గల్ల ఓనర్ గంగాధర్ పనిచేసే రూములో ఫోన్ చార్జింగ్ పెట్టి వెళ్లిపోతాడు. మళ్లీ వచ్చి చూసేసరికి ఫోన్ అక్కడ కనిపించకపోయేసరికి నా ఫోన్ పోయింది గంగాధర్ నువ్వు తీసావా అని అడుగుతాడు. నాకు తెలియదు సార్ అని గంగాధర్ అనడంతో అందరినీ పిలిచి అడుగుతాడు ఇల్లు గల ఓనర్. సార్ దొంగని ఇక్కడే పెట్టుకొని ఎక్కడ ఫోన్ పోయింది అంటారేంటి సార్ పోలీసులకు ఫోన్ చేయండి అని అందులో ఒక అతను అంటాడు. ఎవరు అని అనడంతో ఈ గంగాధర్ ఒక మనిషిని కొట్టి జైలుకు వెళ్లొచ్చాడు సార్ అతనే దొంగ అని అతను అంటాడు. నేను ఫోన్ తీయలేదు సార్ ఎవరైనా తీసి ఉండొచ్చు కదా అని గంగాధర్ అంటాడు. సార్ ఇలా అంటే కుదరదు నాలుగు తగిలిస్తే కానీ చెప్పడు అని అతను అంటాడు. ఇంతలో ఓనర్ గంగ కి ఫోన్ చేస్తాడు.గంగ దేవమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతుంది అత్తయ్య నాకు ఒక ఫోన్ వస్తుంది నేను తర్వాత చేస్తాను అని గంగ ఫోన్ కట్ చేసి అతని ఫోను లిఫ్ట్ చేస్తుంది. కరెంటు పనిచేసే అతన్ని పంపియమంటే దొంగను పంపించావ్ ఏంటి అని ఓనర్ అంటాడు. సార్ ఇప్పుడే వస్తున్నాను అని గంగ అక్కడికి వెళుతుంది.

Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights
Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights

అమ్మాయి నువ్వేనా ఈ గంగాధర్ భార్యవి అని ఓనర్ అడుగుతాడు. అవునండి ఏం జరిగింది అని గంగ అడుగుతుంది. నేను ఫోన్ చార్జింగ్ పెట్టాను చార్జర్ ఉంది ఫోన్ పోయింది మీ ఆయన తీశాడు అని ఓనర్ అంటాడు.అసలేం జరిగిందండి అని గంగ అడుగుతుంది. గంగాధర్ జరిగిన విషయం అంతా చెబుతాడు. ఫోన్ ఎలా పోయిందో తెలుసుకోకుండా పోలీసులు ఫోన్ చేస్తాను అంటారేంటండి అని గంగ అంటుంది.పోలీసులకు ఫోన్ చేయకుండా మాటలు ఏంటి సార్ అని అతను అంటాడు. ఫోన్ చేశాను వస్తూ ఉంటారు అంటూ ఉండగానే ఇంతలో పోలీసులు వస్తారు. సార్ ఫోన్ పోయింది ఈ గంగాధర కొట్టేశాడు అరెస్టు చేయండి అని ఓనర్ అంటాడు. సార్ నేను ఆ ఫోన్ తీయలేదు అని గంగాధర అంటూ ఉండగా కానిస్టేబుల్ అరెస్టు చేయబోతాడు. సార్ నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి ఫోన్ ఎక్కడుందో కనిపెడతాను అని గంగ అంటుంది. ఏంటి సినిమాల్లో లాగా ఇప్పుడు నువ్వు డిటెక్టివ్ అయితావా అని ఓనర్ అంటాడు. సార్ ఒకే ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి నాకు అని గంగ అనడంతో సరేనమ్మా వెతికి పెట్టు అని అతను అంటాడు. ఫోన్ ఎక్కడ పోయిందండి అని గంగ అడగడంతో గంగాధర్ తన రూము చూపించి ఇక్కడే పోయింది గంగాని చెబుతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights
Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights

అరుమంతా  గంగ బాగా చూస్తుంది. పైన ఒక కప్బోర్డు కబోర్డ్ పైన ఒక సెల్ఫీ కనపడుతుంది అది చూసిన గంగ కుర్చీ వేసుకుని దాని లోపల చేయి పెట్టి అక్కడ ఫోన్ ఉందేమోనని వెతుకుతుంది. ఆ సందులో ఫోన్ దొరుకుతుంది.ఇదిగోండి సార్ మీ ఫోను అని గంగ ఫోన్ ఇస్తుంది. చాలా థాంక్స్ అమ్మ ఫోన్ కనిపెట్టినందుకు అని ఓనర్ అంటాడు. ఫోన్ దొరికింది కానీ దొంగ దొర అని అతను అంటాడు. దొంగ కూడా దొరికాడు అనే ఫోన్ కొటేషన్ అతని దగ్గరికి వెళ్లి ఇతనే సార్ ఫోన్ కొట్టేసింది అనే గంగ చెబుతుంది. నేను ఫోన్ కొట్టే లేదు అని అతను అనడంతో మీ షర్టు మడత ఒకసారి చెప్పండి అని గంగ అంటుంది. అతను షర్టు మడత విప్పగానే షర్టు చినిగి ఉంది చూసారా సార్ ఇతనే దొంగ అని గంగ అంటుంది. ఏంటి షర్టు చినిగితే దొంగ అవుతాడు అని అతను అంటాడు. నీకు ప్రూఫ్ కావాలా అని గంగ కబోర్డ్ కు ఉన్న షర్ట్ ముక్కని తీసుకొచ్చి ఇతను ఫోన్ కొట్టేసి అక్కడ దాయబోతుండగా మొలకు తట్టుకొని షర్టు చినిగింది ఇది ఆ మొక్క అని గంగ చూపెడుతుంది.

Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights
Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights

ఐదు నిమిషాల్లో దొంగను కనిపెట్టావ్ ఫోన్ నీకు కనిపెట్టావ్ చాలా గ్రేట్ అమ్మ అని పోలీసులు గంగని మెచ్చుకుంటారు. పదండి గౌరవం లేని చోట పని చేయకూడదు అని గంగ గంగాధర్ ని తీసుకు వెళ్తుండగా ఓనర్ అడుపడి నన్ను క్షమించండి అమ్మ చూసుకోకుండా నోరు జారాను కనీసం చేసినందుకు డబ్బులు అయినా తీసుకోండి అని అతను డబ్బులు చేతిలో పెడతాడు. చూడండి నిన్నటి లాగా మనిషి ఈరోజు ఉండడు గతాన్ని గుర్తు చేస్తూ గాయాన్ని తవ్వకండి కోపంలో ఏదో అలా జరిగిపోయి జైలుకు వెళ్లొచ్చాడు ప్రతిసారి అలా జరుగుతుందని అవమానిస్తూ మాట్లాడకండి అని గంగ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights
Mamagaru Today Episode March 29 2024 Episode 173 highlights

పవన్ ఫ్రెండ్స్ తో కలిసి ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. బేబీ నీకు ఐస్ క్రీమ్ కావాలా డబ్బులు నేను ఇస్తాను పర్వాలేదు అంటూ ఫ్రెండ్స్ తో చుట్టుముట్టి అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు పవన్. ఇంతలో గంగ గంగాధర్ అటుగా నడుచుకుంటూ వస్తూ పవన్ ని చూస్తారు..

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri