తమిళ స్టార్ హీరో విజయ్ మంచి సింగర్ కూడా ఆయన చాలా పాటలను పాడారు. ఆ పాటలు చాలా పెద్ద హిట్ కూడా అయ్యాయి. కాగా.. ఇప్పుడు తొలిసారి ఆయన ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాట పాడటం విశేషం. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `బిగిల్`. ఈ సినిమాకు రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. `వెరితనం.. ` అంటూ సాగే పాటను విజయ్ రీసెంట్గా పాడారట. రెహమాన్ సంగీత దర్శకత్వంలో విజయ్ పాట పాడటం ఇదే తొలిసారి. `బిగిల్` సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ దీపావళికి సినిమా విడుదల కానుంది. నయనతార హీరోయిన్గా నటిస్తుంది.
previous post
next post