NewsOrbit
రాజ‌కీయాలు

‘బాబు’పై వైసీపీ నేతల విమర్శనాస్త్రాలు

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలో రెండు వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడి కావడంతో టిడిపి అధినేత, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబుపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

చెరుకువాడ శ్రీ రంగనాధరాజు, మంత్రి: సీఎం వద్ద పని చేసిన పీఏ ఇంట్లో ఏకంగా ఆరు  రోజులు సోదాలు జరపడం నా జీవితంలో చూడలేదు. రాష్ట్రంలో రెండు వేల కోట్ల అక్రమార్జన గుర్తించడం మాములు విషయం కాదు.

వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి: చంద్రబాబు, లోకేష్‌ అవినీతిపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. చంద్రబాబు దోచుకున్న అవినీతి సొమ్మును కేంద్ర ప్రభుత్వం కక్కించాలి. ఇప్పుడు బయటపడిన రెండు  వేల కోట్ల అవినీతిపై పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు నోరు మెదపడం లేదు?.

అవంతి శ్రీనివాస్, మంత్రి: పోలవరం, పట్టిసీమ వంటి ప్రాజెక్టులలో భారీ అవినీతికి పాల్పడ్డారు. తమ అవినీతిని ఎవరూ పట్టుకోలేరని చంద్రబాబు భావించారు. సీఎంగా పని చేసినప్పుడు ప్రజాధనానికి కాపలాదారుడుగా ఉండాలి కానీ దోపిడీదారుడిగా కాదు. మనీ లాండరింగ్‌లో చంద్రబాబు దిట్ట. అడ్డంగా దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు స్పందించటం లేదు.

బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి: చీటికి మాటికి పిచ్చి రాతలు రాసే ఆంధ్రజ్యోతి, ఈనాడుకు రెండు వేల కోట్ల స్కామ్‌ కనిపించడం లేదా?. ఈ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరపాలి.

కురసాల కన్నబాబు, మంత్రి: చంద్రబాబు అవినీతి, దాని వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు కూడా అర్ధమైంది. ప్రతి రోజూ మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదు?.

ధర్మాన కృష్ణదాస్, మంత్రి: చంద్రబాబు కమీషన్ల బాగోతం బట్టబయలైంది. గతంలో సీబీఐని వ్యతిరేకించింది ఇందుకేనా? అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలి. ప్రజలు అవినీతిని సహించడం లేదు. పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారు.

అంజాద్‌ బాషా, ఉప ముఖ్యమంత్రి:
చంద్రబాబు అవినీతిపై దేశమంతా చర్చ జరుగుతోంది. చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ప్రతి ప్రాజెక్టులో చినబాబుకు కమీషన్లు వెళ్లేవి. ఇది ఆరంభం మాత్రమే అని చెప్పడంతో అవినీతి చేసిన టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ: అమరావతి, పోలవరం పేర్లతో చంద్రబాబు కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దోచుకున్నారు. డొల్ల కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు నడిపించి కోట్లు వెనకేసుకున్నారు.

మార్గాని భరత్‌రామ్, రాజమండ్రి ఎంపీ: కేవలం నాలుగైదు చోట్ల సోదాలు చేస్తేనే వేల కోట్ల రూపాయలు బయటపడ్డాయి. పార్టీ ముఖ్య నేతలపై ఐటి దృష్టి సారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో?. ఐటీ దాడులపై చంద్రబాబు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడడం లేదు?.

గడికోట శ్రీకాంత్‌ రెడ్డి,ప్రభుత్వ చీఫ్‌ విప్‌: దేశ చరిత్రలో అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు. ఆయన అన్ని వ్యవస్థలను మేనేజ్‌ చేయగల ఘనుడు.  స్వాతంత్య్రం తర్వాత దేశ చరిత్రలో ఇటువంటి భారీ స్కామ్‌ ఎక్కడా లేదు. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఇవన్నీ తప్పుదోవ పట్టించేందుకే అమరావతి అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.

ఆమంచి కృష్ణమోహన్, మాజీ ఎమ్మెల్యే: టీడీపీ ఒక పార్టీ కాదు. అది ప్రజాధనాన్ని దోచుకోనే ఒక సంస్థ.
అమరావతిలో రాజధాని భూములు పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారు. అచ్చెన్నాయుడు, బోండా ఉమలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోట్లు దోచుకున్నారు. ఎల్లో మీడియా రామోజీరావు, రాధాకృష్ణలు ఫోర్త్‌ ఎస్టేట్‌ను నాశనం చేశారు.

కారుమూరి నాగేశ్వరరావు. తణుకు ఎమ్మెల్యే:
చంద్రబాబు అవినీతి చిట్టాపై లోతైనా విచారణ జరపాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి.

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment