NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

శిద్ధా సిద్ధమే… కానీ…!

టీడీపీ నుండి వైసిపిలోకి వలసలు ఆగడం లేదు. ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ఉండడంతో వైసీపీ తమ ఆకర్ష మంత్రాలకు పదును పెట్టింది. ఇదే తరుణంలో కాస్త పేరున్న నేతలు కూడా అధికారంలోకి దూకేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు సహా, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, కొందరు కీలక నాయకులు వైసిపి లోకి దూకేయగా తాజాగా మరికొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో టీడీపీకి అండ, ఒక రకంగా రాష్ట్ర టీడీపీలో ఓ సామజిక వర్గానికి దన్నుగా ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు అతి త్వరలోనే వైసీపీలోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగానే వారి కుటుంబంలో కొందరిని కండువా కప్పించారు.

కుటుంబ ఒత్తిడి సహా చాలా కారణాలు…!

టీడీపీలో శిద్ధా పెద్ద వికెట్. పార్టీకి ఆర్ధిక దన్ను, కీలక నాయకుల్లో ఒకరు. పాలిట్ బ్యూరో సభ్యుడిగానూ, శ్రీశైలం దేవస్థాన చైర్మన్ గాను, ఎమ్మెల్సీ గాను, మంత్రి గాను చేసారు. ఆయన ఏం చేసిన వివాదం లేకుండా సైలెంట్ గా చేసుకు వెళ్లిపోతుంటారు. ఇప్పుడు కూడా వైసీపీలోకి వెళ్ళాలా? వద్ద? అంటూ మల్లగుల్లాలు పడుతూనే చివరికి చేరేందుకు మొగ్గు చూపారు. అందుకు అనేక కారణాలున్నాయి. జిల్లాలో శిద్ధా కుటుంబానికి చాలా క్వారీలున్నాయి. గ్రానైట్ తవ్వకాల్లో ఆరితేరిన ఆ అన్నదమ్ములు, బంధువర్గానికి ఇటీవల ప్రభుత్వం రూ. 1000 కోట్ల వరకు ఫైన్ వేసింది. వారి అక్రమాలను నిగ్గు తేల్చింది. ఇవి కట్టలేక, ప్రభుత్వంతో పోరాడలేక సతమతమవుతున్నారు. అందుకే రాజకీయంగా ఈ కుటుంబ సభ్యులందరూ కొద్దీ రోజులుగా చర్చించుకుంటున్నారు. భిన్న అభిప్రాయాలూ వచ్చినప్పటికీ టీడీపీపై నమ్మకం లేకపోవడం, వైసిపి మాంచి స్వింగ్ లో ఉండడంతో కొన్ని ఒత్తిళ్ల మేరకు నెమ్మదిగా ఒక్కొక్కరు వైసీపీలోకి వెళ్లాలని, ఆ పార్టీకి దన్నుగా ఉండాలని డిసైడ్ అయ్యారన్నమాట. పనిలో పనిగా శిద్ధా ఇటీవల ఆయన బాగా నమ్మే ఓ స్వామీజీని కూడా కలిసి వైసిపిలో తన భవిష్యత్తుపై సలహాలు తీసుకున్నారట.

నామినేటెడ్ పదవి కోసం…!

పార్టీలో చేరేందుకు సిద్ధమే. కానీ కొన్ని షరతులు తమవి నెరవేర్చాలని ఆ కుటుంబం బలంగా కోరుతుందని సమాచారం. తమ గ్రానైట్ క్వారీలపై ఉన్న ఫైన్ పూర్తిగా తగ్గించేయడం…! కుటుంబంలో ఒకరికి కీలకమైన నామినేటెడ్ పదవి ఇవ్వడం…! వచ్చే ఎన్నికల్లో రాఘవరావుకి కోరిన చోట టికెట్ ఇవ్వడం…! వంటి షరతులు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే వీటిపై వైసిపి వర్గాల నుండి సానుకూల సంకేతాలు రాలేదట. చేరాల్సిన వారు చేరవచ్చు, తర్వాత సంగతి తర్వాత అంటూ పార్టీ పెద్దల నుండి ఆదేశాలు రావడంతో అటూ, ఇటూ ఊగిసలాడుతున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు కల్పించుకుని సిద్ధతో మాట్లాడే ప్రయత్నం చేయడం… శిద్ధా తమ సామజిక వర్గం నాయకులతో అంతర్గతంగా మాట్లాడుతుండడం… రెండు, మూడు రోజుల్లో ఆయన నిర్ణయం ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

Related posts

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

Leave a Comment