NewsOrbit
5th ఎస్టేట్ న్యూస్

ఏబీఎన్ ఆర్కే కొత్త తప్పులు…!

అక్షరమంటే దిక్కు .., దిక్సూచి… లక్ష్యం… ఉండాలి. అవి సదుద్దేశంతో ఉండాలి. అవి లేకపోతేనే “దిక్కులేని అక్షరాలు” అంటుంటారు. తెలుగునాట ఆ దిక్కులేని అక్షరాలకు ఆజ్యం పోసింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రమే.దిక్కు అంటే ఇక్కడ లక్ష్యం, మార్గం మాత్రమే పరిమితం కాదు… సిగ్గు కూడా వర్తిస్తుంది. ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది…? రాధాకృష్ణ అంతగా తప్పు ఏం చేశారు..? ఆయన అక్షరాలు అంతగా ఏమి దారి తప్పాయో తెలుసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రధాన పత్రికల్లో అనుకుంటే ఒకే సొంత లక్ష్యాలు అనుకోవచ్చు.., కానీ జిల్లా పత్రికల్లోనూ ఇటువంటి అక్షర వంటలతో కాలక్షేపం చేస్తున్నారు.

నెలలో కేసీఆర్ మారిపోయారా…?

కేసీఆర్ పై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉవ్వెత్తున లేచాడు. కన్నెర్ర చేసాడు. పేజీలు, పేజీలు రాసేసాడు. చెత్త పాలన అన్నాడు. దొరల్లా ఉంటె కుదరదు అన్నాడు. అనేక కొత్త పలుకులు పలికాడు. కేసీఆర్ అహంతో ఉన్నాడని, నియంతలా పరిపాలిస్తున్నాడని రాసుకొచ్చాడు. (ఇవన్నీ ఏప్రిల్ 26 న వచ్చిన కొత్తపలుకులో చూడొచ్చు)..! అంటే రాధాకృష్ణ భావం ఏంటి..? కేసీఆర్ కి వ్యతిరేకమా…?? సరే కాసేపు ఇలాగే ఫిక్సయిపోదాం. మరి…! కేసీఆర్ తెలంగాణను దక్షిణ కొరియాలాగా అభివృద్ధి చేసేస్తున్నాడు…! ఆరేళ్లలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ సిక్సర్ కొట్టాడు. కేసీఆర్ అభివృద్ధిని ఎవరూ అందుకోలేరు. అంటూ మళ్ళీ రెండు రోజుల కిందట రాసాడు. అంటే కేసీఆర్ కి రాధాకృష్ణ అనుకూలమా…?? కాదు. అక్కడ ఆ అక్షరానికి పైన చెప్పుకున్న లక్షణాలు ఏమి ఉండవు. అక్షరం అమీబాలాగా ఆకారం లేకుండా తిరుగుతూ, మారుతూ ఉంటుంది. మరి ఆంధ్ర లో జగన్ విషయంలో అలాగే ఉండొచ్చుగా, దిక్కులేని అక్షరాన్ని ప్రయోగించవచ్చుగా అనుకుంటారేమో… ఇక్కడ కులం, వర్గం అడ్డు వస్తుంది. పైగా అక్కడ (తెలంగాణ లో) చంద్రబాబు అనేవాడు రాజకీయంగా లేడు. ఇక్కడ చంద్రబాబు అనేవాడు ఉన్నాడు, రాధాకృష్ణ అనేవాడు ఆయనకు అక్షర బంటుగా ఉంటున్నాడు.

మధ్యలో దూరిపోవడం అలవాటే…!

ముఖ్యమంత్రి , మంత్రి మాట్లాడుకుంటే బయటకు వాస్తవాలు వస్తాయా…? ముఖ్యంన్త్రి, ప్రధానమంత్రి మాట్లాడుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయా…? అవేం రావు. వాళ్ళు నేరుగా చెప్తేనే, లేదా ప్రకటన రూపంలో ఇస్తేనే రాయాలి. కానీ ఆంధ్రజ్యోతిలో మొదటి నుండి ఒక చెత్త సంస్కృతి ఉంది. ఇద్దరు భేటీ అయితే దానిపై తనకు తోచింది, తాను అనుకున్నది ఊహించుకున్నది వారు మాట్లాడుకున్నది రాసెయ్యడం అలవాటే. ఈరోజు ప్రకాశం జిల్లాలో వచ్చిన ఒక వార్తే అందుకు ఉదాహరణ. నిన్న సీఎం జగన్, మంత్రి బాలినేని కలిశారు.

జిల్లాలో రాజకీయాలు మాట్లాడుకున్నారు. “వాళ్లిద్దరూ చీరాలపై మాట్లాడుకున్నారట. కరణం బలరాం కి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకున్నారట.., అలాగే ఆమంచిని కూడా దూరం చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనుకున్నారట. సిఐ, ఇతర బదిలీలపై చర్చించారట… జిల్లాపై ఏకాంతంగా మాట్లాడుకున్నారట..” ఇదీ ఈరోజు ఆంధ్రజ్యోతి లో వచ్చిన వార్తా సారాంశం. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నట్టు, రాసేస్తూ తన సొంత అక్షరం ఉపయోగించడం పత్రికకు అలవాటుగా మారింది. ఇదే తరహాలో చీరాలలో తనకు కావాల్సిన కరణం విషయంలో అనుకూలంగా నేరుగా సీఎం జగన్, మంత్రి బాలినేని చెప్పినట్టు రాసుకొచ్చారు. కానీ అక్కడ జరిగిన వాస్తవాలు వేరు
“నిన్న ఉదయం సీఎం జగన్ తో మంత్రులు బాలినేని, కొడాలి నాని, విజయసాయిరెడ్డి లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలు, ఢిల్లీ పర్యటన రద్దు, సుప్రీం కోర్టులో పిటిషన్ అంశాలపై మాట్లాడుకున్నారు. రానున్న వారంలో వ్యవహరించాల్సిన వ్యూహాలపై మాత్రమే గంట మాట్లాడుకున్నారు” ఆ తర్వాత విజయసాయిరెడ్డి, బాలినేని కలిసి అరగంట మాట్లాడుకున్నారు. అక్కడ మాత్రమే చీరాల చర్చ వచ్చింది. వారిద్దరూ చీరాల తాజా అంశాలపై మాట్లాడుకున్నారు. సీఎం జగన్ వద్ద ఈ టాపిక్ రాలేదు. కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. నిజానికి జగన్ స్వభావం, వ్యక్తిత్వం తెలిసిన వారు… దీన్ని అంగీకరించరు. జగన్ ఇటువంటి వ్యవహారాలను నేరుగా మాట్లాడరు. విజయసాయి ద్వారానే నడిపిస్తుంటారు. కానీ జ్యోతిలో ఈ వార్తా చూసి జిల్లాలో నవ్వులాట మొదలయ్యింది.

ఇసుకపైనా సొంత రాతలు…!

ఇక ప్రభుత్వం పెన్ను ఎత్తడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా?? అని ఎదురు చూసే రాధాకృష్ణకు రెండు రోజుల నుండి ఇసుక అంశం దొరికింది. దీనిపై గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాధాకృష్ణ వాటిని కొనసాగించి డైలీ సీరియళ్లు మొదలు పెట్టారు. నేరుగా ఆ పార్టీ ఎంపీ రఘు రామ్ కృష్ణం రాజు ఇంటర్వ్యూ చేసి… ఆయన ద్వారా జగన్ పై విమర్శలు గుప్పించి… సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలే జగన్ పై గుర్రుగా ఉన్నారు అనేలా రాసుకొచ్చారు. నిజానికి ఇదే వార్తా ఈనాడులోనూ వచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలు, అవినీతిని రాశారు. కానీ జ్తయోటిలో మాత్రం రాజకీయాలు అద్ది, పూర్తిగా వైసిపి లో చిచ్చు , తన శత్రువు జగన్ సీటుకి తగిలేలా, సొంత వ్యాఖ్యలు జోడించి రాశారు. నిజానికి ఈ రాతలు, ఈ అక్షరాలా వలన జగన్ కి జరిగే నష్టం పెద్దగా ఉండదు కానీ, చంద్రబాబు ఒరిగే లాభం ఏమి ఉండదు. కానీ జర్నలిజమే దిక్కులేనిది.., అక్షరమే దిక్సూచి లేనిది అయిపోతుంది.

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju