NewsOrbit
5th ఎస్టేట్ రాజ‌కీయాలు

సొంత పార్టీ లో అపోజిషన్ – జగన్ చడీచప్పుడు కాకుండా కొత్త ప్లాన్ ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిపాలన మొదలై ఏడాది అయిన సందర్భంగా కొద్ది రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అతని పాలన పై విశ్లేషణలు చేసి చివరికి దాదాపు ప్రశంసలే కురిపించారు. జగన్ ముందుచూపు గల నాయకుడని మరియు సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పదేపదే ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఎంతో విడ్డూరంగా జగన్ ను అటు నిపుణులు, విశ్లేషకులు మరియు ప్రజలు పొగుడుతుంటే సొంత పార్టీ నాయకులు మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు మరియు ఎంపీలకు జగన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుననే అవకాశమే దొరకడం లేదట.

Andhra Pradesh to clear pending housing scheme dues- The New ...

మనం గమనించినట్లైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు సొంతపార్టీ పైన విమర్శలు గుప్పించారు. సారా విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, ఇసుక విషయంలో బ్రహ్మనాయుడు, నీటి విషయంలో మహీధర్రెడ్డి ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా జాబితాలోకి సీనియర్ రాజకీయ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా చేరిన విషయం తెలిసిందే. చాలా సెన్సేషనల్ రీతి లో ఆనం తన సొంత నియోజకవర్గమైన వెంకటగిరికి ఇప్పటివరకు తాను అధికారంలో ఉండి ఏమి చేయలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రిత్వ శాఖలో ఉన్న మంత్రులపై మరియు అధికారులపై విపరీతమైన విమర్శలకు దిగారు.

ఇకపోతే నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి చర్చించే అవకాశం లేకుండా పోతుందని పార్టీ నాయకులు వాపోతుండగా గతంలో టిడిపి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు ఇలాగే వ్యవహరించాలని మరియు జగన్ కూడా బాటలోనే నడుస్తున్నారని వైసిపి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ సంక్షేమ పథకాలు మరియు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ బిజీగా గడుపుతున్నారని…. ఇక కరోనా సంక్షోభం వల్ల అతనికి అస్సలు సమయం ఉండడం లేదని లోపలి మాట.

కానీ ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు కాబట్టి ఇప్పటికే గళమెత్తిన కొంతమంది ఎమ్మెల్యేలు మరియు ఎంపీలకు ఫోన్ లోనే సర్ది చెప్పిన జగన్ త్వరలోనే ఒక అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని వార్తలు బయటకు వచ్చాయి. ఎవరైతే బహిరంగంగా పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేశారో వారితో మరియు పార్టీ హైకమాండ్ కేడర్ లో ఉన్న ముఖ్యమైన నేతలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో జరపవలసిన భవిష్యత్తు కార్యాచరణపై జగన్ ఒక ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారట.. మరి ఇదైనా పార్టీ నేతలను శాంతింపజేస్తుందో లేదో చూడాలి మరి.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju