NewsOrbit
న్యూస్

చంద్రబాబుకి ఒక ఫోన్ కాల్ వచ్చింది… స్టేట్ మొత్తం హాట్ డిస్కషన్!

వైకాపాలో కాస్త అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్న దశ ఇది. ఇది అతి తొందర్లోనే పోతుందా లేక ఇలానే కంటిన్యూ అవుతుందా అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలని టీడీపీ నేతలు అప్పుడే స్కెచ్ లు, ప్లాన్ లూ వేసేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఫోన్ కాల్ వ్యవహారం బాబును కొత్త ఆలోచనలో పాడేసిందని, ఆ సలహాను ఇప్పుడే పాటించేద్దామా లేక మరికొంతకాలం వెయిట్ చేద్దామా అనేది బాబు ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఇంతకూ ఆ ఫోన్ కాల్ ఏమిటి, బాబు స్కెచ్ ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

కొంద‌రికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వలేద‌ని.. మ‌రికొంద‌రికి నిధులు ఇవ్వడం లేద‌ని.. ఇలా రకరకాల కోణాల్లో వైకాపాలో అసంతృప్తి ఉంది. ఈ నేప‌థ్యంలో వీరి అసంతృప్తిని త‌గ్గించేందుకు జ‌గ‌న్‌కు కొంత సంక‌ట స్థితి ఏర్పడిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి అయిన తూర్పు గోదావ‌రికి చెందిన ఓ నాయ‌కుడు ఫోన్ చేశారట. “సార్‌.. ఈ స‌య‌మంలో వైకాపాలో ఉన్న అసంతృప్తి నేత‌ల‌ను మ‌న‌వైపున‌కు తిప్పుకుందామా? అని అన్నార‌ని టీడీపీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. అంటే… ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైనంత మెజారిటీ లేక‌పోయినా.. కనీసం జ‌గ‌న్‌ కు ఉన్న మెజారిటీని త‌గ్గించ‌డం ద్వారా అయ్యినా వ్యూహాత్మకంగా పావులు కదుపుదామని, తద్వారా ఎన్నికలకు వెళ్దామని చెప్పారట. వినేవారికి ఇది కాస్త అత్యేసే అయినా బాబు కూడా ఈ ఫోన్ కాల్ కు సానుకూలంగానే స్పందించార‌ని అంటున్నారు.

ప్రస్తుతం ఈ టాపిక్ టీడీపీ లో హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అయితే… బాబు సానుకూలంగా స్పందించినా కూడా ఇంకాస్త సమయం ఎదురుచూస్తే మంచిది అనే అభిప్రాయాన్ని వెళ్లబుచ్చారంట. ఎందుకంటే… అసంతృప్తితో ఉన్న నేతలతో జగన్ మాట్లాడారా.. మాట్లాడితే ఏమి మాట్లాడారు.. ఎలాంటి హామీలు ఇచ్చారు అనే విషయంలో స్పష్టత లేకుండా ముందుకు వెళ్తే మొదటికే మోసం వస్తుందని బాబు ఆలోచిస్తున్నారంట. ఈ క్రమంలో మరో రెండు లేక మూడు నెలలు ఆగిన అనంతరం రంగంలోకి దిగుదామని బాబు సూచించారట.

ఎందుకంటే… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైకాపాలో ఇంకా అసంతృప్తి పెరుగుతుందా, లేక ఈ నలుగురైదుగురి దగ్గరే ఆగిపోతుందా అనేదానికి ఇంకాస్త సమయం పట్టే పరిస్థితి ఉంది. అంటే.. మ‌రో ఐదారు మాసాల్లో జగన్ క‌నుక స‌ర్దుబాటు చేసుకోకపోతే.. చంద్రబాబు రంగంలోకి దిగి, తన అనుభవాన్ని అంతా రంగరించి జ‌గ‌న్‌ కు ఎస‌రు పెడ‌తార‌ని టీడీపీలో చ‌ర్చ న‌డుస్తోంది. మరి బాబు వ్యూహాలు ఫలిస్తాయా.. జగనే ఈ లోపు సర్ధుబాట్లు చేసుకుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N