NewsOrbit
న్యూస్

“అమ్మ మొగుడు” డైలాగ్ మీద కొడాలి నాని రియాక్షన్?

తన పుట్టినరోజు సందర్భంగా బాలయ్య తన అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. తన తండ్రి నటించిన సినిమాలోని ఆరు నిమిషాల పైగా ఉన్న ఈ “శివశంకరి, శివానంద లహరి” పాటను బాలయ్య… ఎంతో కష్టంగా ఉన్నా, అలవోకగా పాడేసి అభిమానాలకు గిఫ్ట్ ఇచ్చారు. ఇక మరో బంపర్ సర్ప్రైజ్ ఇచ్చిన బాలయ్య… బోయపాటితో తీస్తున్న తన 106వ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేసారు. బోయపాటి – బాలయ్య హిట్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. టీజర్ లో బాలయ్య.. ఎప్పుడూ కనిపించన లుక్ లో, తెల్ల లుంగీ కట్టుకుని, మీసం తిప్పి ఉన్న మాస్ లుక్ లో అభిమానులను అలరించారు. ఆ సంగతులు అలా ఉంటే…ఈ టీజర్ లో బాలయ్య చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

“ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో” అంటూ మొదలుపెట్టిన బాలయ్య… “శీనుగారూ మీ నాన్న గారు బాగున్నారా అనేదానికి… శ్రీనుగారు మీ అమ్మా మొగుడు బాగున్నాడా అనేదానికి చాలా తేడా ఉందిరా లంబిడీకొడకా” అని చెప్పే డైలాగ్ హాట్ టాపిక్ అయ్యింది. అయితే… ఈ డైలాగును ఏపీ మంత్రి కొడాలి నానీ ని ఉద్దేశించే పెట్టారా అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతుంది. ఈ మద్యకాలంలో “నీ అమ్మ మొగుడు” అనే డైలాగును కొడాలినాని తెగ వాడేశారు. దీంతో ఈ దెబ్బతో నానీకి ఒక క్లాస్ పీకినట్లు ఉంటుంది అనుకున్నారో లేక ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచే ఉద్దేశ్యమో తెలియదు కానీ… ఎత్తుకోవడం ఎత్తుకోవడమే ఈ డైలాగ్ తో మొదలుపెట్టిన బాలయ్య ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచారు. అయితే… ఈ విషయాలపై తన సన్నిహితుల వద్ద స్పందించిన నానీ… ఇవన్నీ పట్టించుకుంటే కష్టం, రాజకీయాల్లో ఉన్నాం కదా తిట్టేవాడూ ఉంటాడు పొగిడేవాడు ఉంటాడు అని లైట్ తీసుకున్నారట!

కాగా… హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో, నందమూరి బాలకృష్ణ 60వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా.. నందమూరి బాలకృష్ణ అభిమానులు, బంధుమిత్రుల హడావిడి ఎక్కువగానే ఉంది. ఆన్ లైన్ లో వివిధ మాధ్యమాల ద్వారా బాలయ్యకు పుట్టిన రోజు శభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు హడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా ఇది బాలయ్యకు షష్టిపూర్తి ఏడాది కావటంతో ఈ హడావిడి కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి ఉండటంతో ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దు అని, అలాగే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినా బౌతిక దూరం పాటిస్తూ చెయ్యాలని బాలయ్య పిలుపు ఇచ్చారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju