Chandrababu Arrest: ఏపీ ఫైబర్ నెట్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతించింది. సోమవారం చంద్రబాబును కోర్టు ఎదుట హజరుపర్చాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు ప్రత్యక్షంగా హజరుపర్చాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబుకు ఈ నెల 19 వరకు జ్యూడీషియల్ రిమాండ్ ఉంది. ఈ క్రమంలో సోమవారం వ్యక్తిగతంగా చంద్రబాబును హజరుపర్చాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో పక్క చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీం కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఏసీబీ కోర్టు తెలిపింది. సీఐడీ తరపున న్యాయవాది వివేకానంద వాదనలు వినిపించారు.

పీటీ వారెంట్ ద్వారా చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ఫైబర్ నెట్ కేసులో హజరుపర్చిన తర్వాత ఈ కేసులో తొలుత 14 రోజులు రిమాండ్ విధించే అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంలో చంద్రబాబు తరపున రిమాండ్ రిపోర్టుపై న్యాయవాదులు వినిపించే అవకాశం ఉంటుంది. అదే విధంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తారు. మరో పక్క సీఐడీ ఈ కేసులో కస్టడీ విచారణకు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉంటాయి. వీటిపై ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.
YS Sharmila: కీలక నిర్ణయాన్ని ప్రకటించిన వైఎస్ షర్మిల .. 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ టీపీ పోటీ