NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: బందర్ పోర్టుకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ .. చంద్రబాబుపై మరో సారి విమర్శనాస్త్రాలు   

Share

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ బందరు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మచిలీపట్నం మండలం తపసిపూడి గ్రామంలో పోర్టు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ, ఇతర అనుబంధ ప్రాజెక్టులకు మొత్తం రూ.5,155.73 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తొంది. 35.12 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గుకు, మరొకటి మల్టీ పర్స్ కంటైనర్ తో ఎగుమతి, దిగుమతులకు ఉపయోగపడేలా మొత్తం నాలుగు బెర్తులతో నిర్మాణం చేపట్టనున్నారు. మచిలీపట్నం పోర్టును 24 0 30 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనులు పూర్తి అయిన తర్వాత పోర్టు ద్వారా 24వేల మందికి ఉపాధి లభిస్తుందని సమాచారం.

ap cm ys jagan speech Machilipatnam public meeting

 

ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చిరకాల స్పప్నమైన బందరు పోర్టుకు అన్ని సమస్యలను అధిగమించి పోర్టుకు లైన్ క్లీయర్ చేశామని తెలిపారు. బందరుకు సముద్రవర్తకంలో వందల ఏళ్ల చరిత్ర ఉందన్నారు. కానీ పోర్టు నిర్మాణం గురించి ఎవరూ పట్టించుకులేదని విమర్శించారు. తాము వచ్చిన బందరు వాసుల కలను నెరవేర్చామన్నారు. కృష్ణాజిల్లా చరిత్రను మార్చబోయే ఆస్త్రంగా పోర్టు మారబోతుందని ఆయన ఆకాంక్షించారు.  అలాగే గుడివాడ – మచిలీపట్నం రైల్వే లైన్ పోర్టుకు అనుసంధానం చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ లకూ ఇది చేరువలో ఉంటుందని అన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని జగన్ పేర్కొన్నారు.

CM YS Jaga Bandar Port

 

ఇదే సందర్భంగా ప్రతిపక్షాలపై మరో మారు విరుచుకుపడ్డారు సీఎం జగన్. మచిలీపట్నానికి చంద్రబాబు తీరని ద్రోహం, తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. పోర్టు రాకుండా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారని తెలిపారు.ఇక్కడ పోర్టు రాకపోతే అమరావతికి డిమాండ్ ఉంటుందని చంద్రబాబు కుట్ర చేశారన్నారు. ఇప్పుడు బందరు పోర్టు నిర్మాణానికి గ్రహణాలు తొలగిపోయాయని పేర్కొన్నారు. రూ.550 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. గతంలో బందరు జిల్లా కేంద్రంగా ఉన్నా ఒక్క అధికారి ఉండేవాడు కాదనీ, ఇప్పుడు కలెక్టర్ తో సహా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంటోందన్నారు. మరో 24 నెలల్లోనే బందరు రూపు రేఖలు మారిపోతాయని జగన్ ఆకాక్షించారు.

CM YS Jaga Bandar Port

 

రుషుల యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకున్నట్లు పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పేదలకు పంచబోయే భూమిని సమాధులుగా పోలుస్తూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పై ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి మానవత్వం లేని, వికృత ఆలోచనలు ఉన్న వ్యక్తులకు మద్దతు ఇస్తారా అని ప్రశ్నించారు. పేదవాడు పేదవాడిగా మిలిగిపోకూడదనేది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని, అందుకే అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రెండేళ్ల కిందటే నిర్ణయించామన్నారు. కానీ చంద్రబాబు అండ్ దొంగల ముఠా దాన్ని అడ్డుకునే యత్నం చేసిందన్నారు. అయినా అన్ని సమస్యుల, కోర్టు కేసులు అధిగమించి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నామని తెలిపారు. పేదలకు ఏనాడూ సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబుకు వాళ్ల కష్టాలు ఎలా తెలుస్తాయని అన్నారు.  మూడు రాజధానులు వద్దు ఉంటూ అన్ని ప్రాంతాల అభివృద్ధినే అడ్డుకున్నారని , మూడు ప్రాంతాల మీద దాడి చేశారనీ, పేదలంటే చంద్రబాబుకు చులకన అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దారుణమైన మనస్థత్వం ఉన్న రాక్షసులతో మనం యుద్దం చేస్తున్నామన్నారు.

సీనియర్ సినీ నటుడు శరత్ బాబు ఇకలేరు


Share

Related posts

చదవేస్తే ఉన్న మతి పోయింది అంటే ఇదేనేమో ..! ఇంజనీర్ ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యాడో..!!

somaraju sharma

వకీల్ సాబ్ తో భయపెడుతున్న దిల్ రాజు ..?

GRK

RamaRao: రామారావు తో వేణు రీఎంట్రీ..!!

bharani jella