AP CM YS Jagan: గవర్నర్‌తో ముగిసిన సీఎం జగన్ భేటీ..కీలక విషయాలపై చర్చ

Share

AP CM YS Jagan: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్ల ఆమోదంతో పాటు రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలు, గ్రూపు ఒన్ వివాదం తదితర కీలక అంశాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించినట్లు సమాచారం.

AP CM YS Jagan meets governor biswabhusan harichandan

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికకు గానూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నలుగురు నేతల పేర్లను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, మోసేన్ రాజు, రమేష్ యాదవ్ పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేసింది. అయితే వీరిలో తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్ లపై గతంలో పలు కేసులు ఉన్న విషయాన్ని తెలియజేస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాసి అభ్యంతరాలు తెలియజేశారు. దీంతో గవర్నర్ ఆ పేర్ల ఆమోదానికి అభ్యంతరం తెలియజేసినట్లు సమాచారం.

Read More: Video Viral: పొలంలో పనులు చేస్తుండగా కాటేసిన నాగుపాము.. పామును చేతపట్టుకుని ఆ యువకుడు చేసిన పనికి అందరూ షాక్..

ఈ నేపథ్యంలో గవర్నర్ ను సీఎం జగన్ కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా త్వరలో 80 కార్పోరేషన్లు, 960 డైరెక్టర్ ల పదవుల భర్తీకి సీఎం జగన్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వాటిపైనా చర్చించినట్లు సమాచారం. పలు విషయాలకు సంబంధించి సీఎం జగన్  గవర్నర్ బిశ్వభూషణ్ నుండి సూచనలు, సలహాలు తీసుకున్నారు.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

6 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago