Big Breaking: గవర్నర్ కోటాలో ఖాళీ అయినా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. సీఎం జగన్ ఆయనను కలిసి వచ్చిన గంట వ్యవధిలోనే ఆ నాలుగు పేర్లుకి ఆమోదం తెలుపుతూ రాజముద్ర వేసేసారు. దీంతో ఆ నలుగురు పేర్లు విషయంలో జరుగుతున్న చర్చ, కలుగుతున్న అనుమానాలు నివృత్తి అయిపోయాయి. ఈ క్రమంలో తాజగా ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, కొయ్యే మోషేను రాజు, రమేష్ యాదవ్ ఎంపికయ్యారు.
Must Read: సీఎం – గవర్నర్ భేటీకి ముందు పరిస్థితులు ఇవీ.. ఎమ్మెల్సిల విషయంలో ఉత్కంఠ.. ఎందుకంటే..!?
Big Breaking: Governor Accepted 4 MLC List
నిజానికి ఈ పేర్లు మోదించాలని కోరుతూ వైసీపీ ప్రభుత్వం మూడు రోజుల కిందటే లిస్టుని పంపించింది. కానీ రెండు పేర్లు విషయంలో గవర్నర్ కొన్ని అభ్యంతరాలను తెలిపారని వార్తలొచ్చాయి. లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు పై క్రిమినల్ కేసులు ఉండడంతో ఎంపికపై కొంత ప్రతిష్టంభన నెలకొంది. అందుకే ఈ జాబితా మూడు రోజుల నుండి గవర్నర్ కార్యాలయంలో కదల్లేదు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 5 . 40 వరకు సీఎం జగన్ – గవర్నర్ ల భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఈ చర్చ జరిగింది. గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలకు జగన్ వివరణ ఇవ్వడంతో అంతా సానుకూలంగా ముగిసింది. ఈ భేటీ జరిగిన గంట వ్యవధిలోనే ఈ పేర్లు ఆమోదిస్తూ గవర్నర్ కార్యాలయం నుండి ఉత్తర్వులొచ్చాయి..!
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…