NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: ఏపీ సీఐడీ కేసులో అయ్యన్నకు భారీ ఊరట..కానీ..

AP High Court:  ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి భారీ ఊరట లభించింది. పది సంవత్సరాలకు పైబడి శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రాధమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. అయితే సీఐడీ అధికారులు సీఆర్పీసీలోని 41 ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ జరుపుకోవచ్చని తెలిపింది. అయ్యన్న పాత్రుడు, ఆయన ఇద్దరు కుమారులపై ఏపీ సీఐడీ అధికారులు ఐపీసీ 464, 467, 471, 474, సెక్షన్ల కిందకేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా ఇటీవల ఆయన్ను సీఐడీ అధికారులు అరెస్టు చేసి విశాఖ కోర్టులో హజరుపర్చారు. అయితే ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఐపీసీ 467 చెల్లదని పేర్కొన్న న్యాయమూర్తి రిమాండ్ రిపోర్టు తిరస్కరించి బెయిల్ మంజూరు చేశారు.

Ayyannapatrudu

 

ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడుపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన తరపు న్యాయవాది వీవీ సతీష్ హైకోర్టును ఆశ్రయించారు. తన క్లయింట్ పై ఉద్దేశపూర్వకంగా సెక్షన్ 467 నమోదు చేశారనీ, ఈ కేసులో సెక్షన్ 467 చెల్లదని అయ్యన్న తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. మరో వైపు సీఐడీ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. జలవనరుల శాఖకు చెందిన 0.16 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారనీ, తదుపరి ఫోర్జరీ ఎన్ఓసీ పత్రాలు సృష్టించారనీ, దీనిపై ఈఈ ఫిర్యాదు చేస్తే ఆయనను బెదిరించడం, భయపెట్టడం వంటివి చేశారని అందుకే సెక్షన్ 467 వర్తిస్తుందని వివరించారు. గత వారం ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఇవేళ అయ్యన్న కేసులో సెక్షన్ 467 వర్తించదని కోర్టు తెలిపింది.

Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట

AP CID

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju