ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Wine Shops: ఏపిలో మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

Share

AP Wine Shops: ఆంధ్రప్రదేశ్ లో మందు ప్రియులకు వరుసగా జగన్ సర్కార్ గుడ్ న్యూస్‌ల మీద గుడ్ న్యూస్ లు అందిస్తోంది. నూతన సంవత్సర కానుకగా 20 నుండి 30 శాతం ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత బ్రాండెడ్ మద్యంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా మద్యం దుకాణాల పనివేళలను పొడిగించింది. మద్యం షాపులు మరో గంట పాటు తెరిచేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల పని వేళలు గంట పొడిగింపు చేసింది. రాత్రి పది గంటల వరకూ విక్రయాలు సాగించేందుకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

AP Wine Shops working hours extended one hour
AP Wine Shops working hours extended one hour

 

AP Wine Shops: ఇక రాత్రి పది గంటల వరకూ

రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ధరలను తగ్గించడంతో బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చిన తరువాత పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా నిలిచిపోయింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మద్యం దుకాణాలను రాత్రి 9గంటల వరకూ మాత్రమే నిర్వహించే వారు. తాజా ఉత్తర్వులతో రాత్రి 10 గంటల వరకూ మద్యం షాపుల్లో విక్రయాలు చేస్తారు.


Share

Related posts

Bigg boss harika : ఇచ్చిపడేసిన బిగ్ బాస్ హారిక.. ఇచ్చిపాడ్ ఆల్బమ్ ప్రోమో అదుర్స్

Varun G

హోంమంత్రి జిల్లాలో పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యేల దూషణల పర్వం!

Yandamuri

AP CM Jagan – Megastar Chiru: మెగా స్టార్ చిరుకు ఏపి సీఎం జగన్ నుండి ఆహ్వానం .. ఎందుకంటే..

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar