NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu: వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణ హాని ..చంద్రబాబు సంచలన ఆరోపణ..

Chandrababu: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు కడప సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే కడప సెంట్రల్ జైలు అధికారిగా వరుణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జైలులో వరుణ్ రెడ్డి జైలర్ గా ఉన్న సమయంలో పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను హత్య జరిగింది. ఆ తరువాత ఆయన సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఆ వరుణ్ రెడ్డి కడప జైలు అధికారిగా ఉండటంపై వివేకా హత్య కేసులో నిందితులకు ప్రాణ హాని ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. శనివారం చంద్రబాబు విజయవాడలోని పరుచూరి అశోక్ బాబు నివాసానికి వెళ్లి పరామర్శించారు. అశోక్ బాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసి నిన్న రాత్రి న్యాయమూర్తి సమక్షంలో హజరుపర్చిన విషయం తెలిసిందే. అశోక్ బాబు బెయిల్ పై ఇంటికి రావడంతో శనివారం ఆయన నివాసానికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు.

Chandrababu comments on viveka murder case issue
Chandrababu comments on viveka murder case issue

 

Read More: AP Special Status: ఏపికి గుడ్ న్యూస్.. ముగిసిపోయిన ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెరపైకి

Chandrababu: కడప జైలు అధికారి వరుణ్ రెడ్డిపై అనుమానం

అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. జైలు అధికారి వరుణ్ రెడ్డిపై అనేక శాఖాపరమైన కేసులు ఉన్నాయనీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆయనను పక్కన పెట్టాయని అన్నారు చంద్రబాబు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వరుణ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చి కడప జైలు ఇన్ చార్జి సూపర్నిటెండెంట్ గా నియమించారన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను చంపేందుకే వరుణ్ రెడ్డిని అక్కడకు పంపారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కడప జైలు అధికారిగా వరుణ్ రెడ్డి నియామకంపై సీబీఐకి లేఖ రాయనున్నట్లు తెలిపారు చంద్రబాబు. జగన్ రెడ్డి, అవినాష్ రెడ్డి సాయంతో వరుణ్ రెడ్డి ద్వారా వివేకా హత్య కేసు నిందితులకు ప్రాణహాని పొంచి ఉందని చంద్రబాబు ఆరోపించారు.

Read More: Tirumala: ఆర్ధిక ఇబ్బందుల్లో ఏపీ..! వెంకన్నపైనే భారం..

అశోక్ బాబు అరెస్టు అన్యాయం

అశోక్ బాబును అన్యాయంగా అరెస్టు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ముగ్గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారన్నారు. 33 మంది టీడీపీ నేతలను హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయానికి గురైన ప్రతి ఒక్కరి పక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం గుండెల్లో నిద్రపోతామన్నారు చంద్రబాబు. తప్పు చేసే ప్రతి అధికారి తప్పించుకోలేరని చంద్రబాబు హెచ్చరించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N