NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan Delhi Tour: కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ

Share

CM YS Jagan Delhi Tour: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రులతో సమావేశమైయ్యారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను సీఎం జగన్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిధులను త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ భేటీలో తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంలో ఏపీలో విద్యుత్ రంగ అభివృద్ధిపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ సీఎం జగన్ ను ప్రశంసించారు. విద్యుత్ రంగంలో ఏపి చాలా బాగా పని చేస్తొందనీ, ఆర్డీఎస్ఎస్ రీ వ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ పై చర్చించడం జరిగిందనీ, ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తొందనీ, ఈ పథకానికి ఏపీ అర్హత పొందినందున నిదులు అందిస్తామని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు.

కాగా శుక్రవారం (రేపు) ఉదయం విజ్ఞాన్ భవన్ లో జరిగే వామపక్ష తీవ్రవాదం నిర్మూలపై సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. రేపు రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం అవ్వనున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఆమిత్ షాతో సీఎం జగన్ చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును అవినీతి కేసులో అరెస్టు చేసి జైల్ కు తరలించిన తర్వాత జగన్ ఢిల్లీ  పర్యటనకు వెళ్లడం, కేంద్ర పెద్దలను కలుస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబు అవినీతికి సంబంధించి సీఐడీ సేకరించిన  ఆధారాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అందజేసి సీబీఐ, ఈడీ దర్యాప్తును కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అదే విధంగా ముందస్తు ఎన్నికలపై చర్చించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు కేసు కోర్టులో ఉందనీ, దాని గురించి జగన్ ఢిల్లీ వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. స్కామ్ లో అడ్డంగా దొరికినందుకే చంద్రబాబు జైల్ కు వెళ్లారన్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాలనే జగన్ కొనసాగిస్తున్నారని చెప్పారు. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన పని జగన్ కు లేదని స్పష్టం చేశారు. టీడీపీ పొద్దుపోని ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతోందని విమర్శించారు.

Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ మరో సారి వాయిదా..


Share

Related posts

బాలకృష్ణ ని బాగా వాడుతున్న హైదరాబాద్ పోలీసులు..!!

sekhar

తీహార్ జైలులో ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ మసాజ్ వీడియోలు వైరల్ ..బీజేపీ విమర్శలపై ఆప్ ఏ విదంగా సమర్ధించుకుంది అంటే..?

somaraju sharma

కాజల్ క్రేజ్ కి మరో ఆఫర్ ..ఇంపార్టెన్స్ లేకపోయినా ఒప్పుకుందా ..?

GRK