NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ మరో సారి వాయిదా..

Share

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విషయంలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. నిన్న, ఈరోజు ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు జరగడంతో సాయంత్రానికి ఏదో ఒక ఆర్డర్ వస్తుందని అనుకుంటున్న తరుణంలో గురువారం కూడా విచారణ వాయిదా పడింది. తదుపరి వాదనలను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే, సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాదనల అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. మరో వైపు చంద్రబాబు రిమాండ్ ను మరో 14 రోజుల పాటు న్యాయస్థానం పొడిగించింది. రిమాండ్ గడువును అక్టోబర్ 19వ రకూ పెంచుతున్నట్లు వెల్లడించింది. నేటితో చంద్రబాబు రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబును వర్చువల్ గా న్యాయమూర్తి ముందు హజరుపర్చారు.

సీఐడీ తరపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్కిల్ డెవలప్ మెంట్ నుండి టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లిన నిధులకు సంబంధించిన స్టేట్ మెంట్ లను న్యాయస్థానానికి సమర్పించారు. టీడీపీ బ్యాంక్ ఖాతాలకు రూ.27 కోట్లు మళ్లించారని ఆధారాలు చూపించారు. ఈ మెయిల్స్ ద్వారా జరిగిన సంభాషణలను ప్రభుత్వ తరపు న్యాయవాదులు న్యాయమూర్తి ముందు ఉంచారు. సీఐడీ వద్ద ఉన్న ఫైళ్లను న్యాయమూర్తికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూపించారు. కేబినెట్ నిర్ణయం మేరకు ఒప్పందం అమలు జరగలేదని, ఒప్పందంలో జరిగిన తప్పిదాలకు చంద్రబాబే  బాధ్యుడని వాదించారు. కొన్ని బ్యాంక్ లావాదేవీలపై చంద్రబాబును ఇంకా విచారించాల్సి ఉందన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ చంద్రబాబుకు అప్లై అవుతుందని అన్నారు. చంద్రబాబును కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉందని కోరారు.

చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదిస్తూ చంద్రబాబుకు స్కిల్ కేసులో సంబంధం లేదని అన్నారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారని న్యాయస్థానానికి వివరించారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయన్నారు. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారన్నారు. ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటు చేశారనీ, వీటి ద్వారా 2 లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారన్నారు. ఇదంతా ఓపెన్ గానే జరిగిందన్నారు. ఇందులో స్కామ్ ఎక్కడుంది. చంద్రబాబు పాత్ర ఏముంది.. ఇది పూర్తిగా రాజకీయ కక్షతోనే పెట్టిన కేసు, ఆయన అవినీతి చేసినట్లుగా ఆధారాలు చూపించలేదన్నారు.

సీఐడీ కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారనీ, మరో సారి ఆయన కస్టడీ అవసరం లేదన్నారు. విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్ వేశారని, చంద్రబాబు కు బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. దూబే వాదనలు ముగిసిన తర్వాత రిప్లై వాదన వినిపిస్తానని ఏఏజీ పొన్నవోలు న్యాయమూర్తికి తెలుపడంతో రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Chandrababu Arrest: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు


Share

Related posts

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దూకుడు పెంచిన ఈడీ .. మరో సారి సోదాలు..ఏపి, తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల్లో..

somaraju sharma

రాజమండ్రిలో అమరావతి రైతుల పాదయాత్ర ..పోటాపోటీ నినాదాలు, నిరసనలతో అజాద్ చౌక్ సెంటర్ లో హైటెన్షన్

somaraju sharma

MP RRR: రఘురామకి ఈజీ కాదు..!? ఆ మంత్రులిద్దరికీ జగన్ బాధ్యతలు..!

Srinivas Manem