Nara Lokesh: అమరావతి ఇన్నర్ రింగ్ అలైన్ మెంట్ కేసులో మాజీ మంత్రి నారా లోకేష్ విచారణ ప్రక్రియ వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆకస్మికంగా దర్యాప్తు అధికారిని మార్పు చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ప్రస్తుతం దర్యాప్తు అధికారిగా ఉన్న ఏఎస్పీ జయరామరాజు స్థానంలో డీఎస్పీ విజయ భాస్కర్ కు బాధ్యతలను అప్పగించారు. దర్యాప్తు అధికారి మార్పునకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. జయరామరాజు కు పని భారం ఎక్కువగా ఉండటంతో దర్యాప్తు అధికారిని మార్పు చేసినట్లుగా పిటిషన్ లో పేర్కొంది.

హైకోర్టు ఆదేశాల మేరకు నారా లోకేష్ ఇవేళ సీఐడీ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు. మంగళగిరి సిట్ కార్యాలయంలో లోకేష్ ను సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకూ ఈ విచారణ కొనసాగనుంది. లోకేష్ విచారణ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ గా పోలీసులను మోహరించారు.
మరో పక్క ఇవేళ ఏసీబీ కోర్టులో చంద్రబాబు పై సీఐడీ దాఖలు చేసిన రెండు పిటీ వారెంట్లపై విచారణ జరగాల్సి ఉండగా, రేపటికి వాయిదా పడింది. వ్యక్తిగత కారణాల వల్ల న్యాయమూర్తి సెలవులో ఉండటంతో ఇవేళ జరగాల్సిన విచారణ రేపటికి వాయిదా పడింది.
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హజరైన లోకేష్