NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొంద‌రు న‌క్క‌తోక తొక్కారు. ఇలాంటి వారి విష‌యంలో వీరంతా ల‌క్కీ బ్రో అనే టాక్ వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను తీసుకుంటే.. అత్యంత సామాన్యుల‌కు టికెట్‌లు ఇచ్చారు. కానీ, ఎన్నిక‌లు చూస్త‌.. భ‌యంకర‌మైన‌.. ఖ‌ర్చుతో కూడుకున్నాయి. అటు టీడీపీ అయినా.. ఇటు బీజేపీ అయినా.. ఖ‌ర్చు పెట్టేవారికే అవ‌కాశం ఇచ్చింది. ఖ‌ర్చు భ‌రించ‌గ‌ల‌ర‌న్న వారికే అవ‌కాశం ఇచ్చింది.

కానీ, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ మాత్రం త‌క్కువ తిన‌లేదు. ఖ‌ర్చు పెట్టే వారికి మాత్ర‌మే సీట్లు ఇచ్చా రు. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్రం సీఎంజ‌గ‌న్ ప్ర‌యోగాలు చేశారు. అకౌంట్ల‌లో ల‌క్ష రూపాయ‌లు కూడా లేని వారికి టికెట్లు ఇచ్చారు. వీరిలో శింగ‌న‌మ‌ల సీటు నుంచి పోటీ చేస్తున్న వీరాంజ నేయులు, కీల‌క‌మైన మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న స‌న్యాల తిరుప‌తిరావు, ఇచ్చాపురం నుంచి పిరియా విజ‌య‌ వంటివారు ఉన్నారు. ఇక‌, ఎంపీ సీట్ల విష‌యానికి వ‌స్తే.. నందిగం సురేష్‌(బాప‌ట్ల‌), గురుమూర్తి(తిరుప‌తి) వంటివారు ఉన్నారు. వీరు ఆర్థికంగా ఏమీ బ‌లంగా లేరు.

అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ అధినేత వీరికి టికెట్‌లు ప్ర‌క‌టించారు. కానీ, అటు వైపు చూస్తే.. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నుంచి కానీ కూట‌మి పార్టీల నుంచి కానీ.. బ‌ల‌మైన అభ్య‌ర్థులు.. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టే వారికి టికెట్లు వ‌రించాయి. మ‌రి వారి పోటీని త‌ట్టుకుని వీరు ఏమేర‌కు నిల‌బ‌డ‌తారు? అనేది మిలియ‌న్ల డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనిపై వారికి మాత్రం సందేహం లేదా? అంటే.. ఉంది. అయితే.. ఇక్క‌డ జ‌గ‌న్ హామీ ఇచ్చార‌నేది టాక్‌.

ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా బాధ్య‌త‌లు తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేరుగా పార్టీ కొంత ఫండ్ ఇస్తుంది. మిగిలిన వాటికి ఇవ్వ‌దు. అదేవిధంగా .. జ‌గ‌న్‌కు తెలిసిన పారిశ్రామిక వేత్త‌లు.. కూడా.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌కు నిధులు స‌మ‌కూర్చిన‌ట్టు స‌మాచారం. తిరుప‌తిరావుకు ఇప్ప‌టికే ఒక ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త నుంచి రూ.5 కోట్లు అందాయ‌ని తెలిసింది. పిరియా విజ‌య‌కు.. కూడా ఇలానే సాయం అందించారు. ఇలా.. అభ్య‌ర్థుల చేతిలో రూపాయి లేక‌పోయినా.. జ‌గ‌న్ మ‌న‌సు పెట్టి వారికి టికెట్‌లు ఇవ్వ‌డంతో నే స‌రిపుచ్చ‌కుండా.. వారిని గెలిపించుకునే బాధ్య‌త‌ల‌ను కూడా తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N