NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

ఎటు చూసినా.. స‌ర్వేలు వ‌స్తున్నాయి. రోజుకు రెండు చొప్పున కూడా స‌ర్వేలు దంచికొడుతున్నాయి. క్షేత్ర స్థాయిలో కీన్ అబ్జ‌ర్వేష‌న్ చేసుకుని మ‌రీ.. ఈ స‌ర్వేలు వండి వారుస్తున్నారు. కొన్ని కొన్ని సర్వేలు.. పైపైనే రిజ‌ల్ట్ ఇస్తుండ‌గా.. మెజారిటీ స‌ర్వేలు మాత్రం మండ‌ల‌స్థాయి.. గ్రామ స్థాయి వ‌ర‌కు పార్టీల ప‌రిస్థితి ఎలా ఉంది? అభ్య‌ర్థుల ప‌రిస్థితి ఎలా ఉంది? అనే కీల‌క విష‌యాల‌ను అంచ‌నా వేసుకుని మ‌రీ.. స‌ర్వేలు వండి వారుస్తున్నాయి. ఇలా వ‌స్తున్న స‌ర్వేల్లో అభ్య‌ర్థుల ప‌రిస్థితి ఏంట‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

దీంతో పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. వాస్త‌వానికి ఇప్ప‌టికే అన్ని పార్టీలూ టికెట్లు దాదాపు ఖరారు చేశా యి. కానీ, నామినేష‌న్ల ప‌ర్వం ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యానికి.. వ‌చ్చిన దాదాపు 20 స‌ర్వేల్లో కొంద‌రు అభ్య‌ర్థు ల విష‌యంలో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని బ‌లంగా తెలుస్తోంది. ఒక స‌ర్వేలో త‌ప్పు చెప్పార‌ని అనుకున్నా.. మ‌రికొన్ని స‌ర్వేల్లోనూ అదే ఫ‌లితం క‌నిపిస్తోంది. దీంతో పార్టీలు అలెర్ట్ అవుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. ఒక స‌ర్వేలో ఒక అభ్య‌ర్థి నెక్ టు నెక్ ఫైట్ చేస్తున్నార‌ని ఫ‌లితం వ‌స్తోంది.

మ‌రో స‌ర్వేలో.. ఆయ‌న గెలుస్తాడ‌ని చెబుతున్నారు. దీనిని కొంత వ‌ర‌కు పార్టీలు.. హ‌ర్షిస్తున్నాయి. నెక్ టు నెక్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను అలెర్ట్ చేస్తున్నాయి. ఇక‌, అన్నిస‌ర్వేల్లోనూ గెలుపు గుర్రం ఎక్క డం క‌ష్ట‌మ‌ని వ‌స్తున్న ప‌లితాల విష‌యంలోనే పార్టీలు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి. ముఖ్యంగా వైనాట్ 175 నినాదంతో ఎన్నిక‌ల‌కు వెళ్తున్న వైసీపీలో ఈ త‌ర‌హా నాయ‌కులు పెరుగుతున్నారు. దీంతో ఇలాంటి వారిని మార్చ‌డం ఖాయ‌మ‌నే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, టీడీపీలోనూ మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు.. టీడీపీ సింగ‌న‌మ‌ల అభ్య‌ర్థి విష‌యంలో స‌ర్వేలు యాంటీగా ఇస్తున్నాయి. ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని స‌ర్వేల్లోనూ సింగ‌న‌మ‌ల వ‌దులుకోవ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు. అదేవిధంగా దెందులూరు ప‌రిస్థితి కూడా అలానే ఉంద‌ని టాక్‌. ఈ విష‌యాన్ని కూడా స‌ర్వేలు చెబుతు న్నాయి. అలానే.. తిరువూరు విష‌యంలోనూ టీడీపీకి ఎదురు గాలి వీస్తోంది. దీంతో ఈ రెండు పార్టీల్లోనూ మార్పులు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు పార్టీ నాయ‌కులు. అయితే.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఈ త‌ర‌హా వ్యాక్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

Related posts

Satyabhama: స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ స‌త్య‌భామ మూవీకి కాజ‌ల్ భారీ రెమ్యున‌రేష‌న్‌.. కెరీర్ లో ఇదే హైయ్యెస్ట్..!?

kavya N

Karthi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. న‌టుడు కాకముందు హీరో కార్తి ఏం పని చేసేవాడో తెలుసా..?

kavya N

గన్ పౌడర్ పరిశ్రమలలో భారీ పేలుడు .. 17 మంది మృతి..!

sharma somaraju

Sukriti Veni: సుకుమార్ కూతురు ఇంత టాలెంటెడ్ గా ఉందేంట్రా.. మొన్న ఉత్త‌మ న‌టిగా అవార్డు.. ఇప్పుడు ఏకంగా..?

kavya N

Devara: ప‌ది ఊర్ల‌కు కాప‌రిగా ఎన్టీఆర్‌.. పదివేల మందితో యాక్షన్ సీన్.. లీకైన దేవ‌ర ఫుల్ స్టోరీ!

kavya N

జేసీ Vs పెద్దారెడ్డి గా తాడిప‌త్రి… గెలిచేది ఎవ‌రో టెన్ష‌న్‌..టెన్ష‌న్‌..?

40 + 10 + 15 + 30 = వైసీపీ…?

నారా లోకేష్‌కు పార్టీ ప‌గ్గాలు.. తెర‌వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా..?

చంద్ర‌బాబు వ‌స్తే.. రేవంత్ స‌హ‌కారం.. ఇది ఎంత వ‌ర‌కు నిజం..?

Jaya Badiga: యూఎస్‌లో న్యాయమూర్తిగా తెలుగు మహిళ .. ప్రమాణ స్వీకార వీడియో వైరల్ .. ప్రత్యేకత ఏమిటంటే..?

sharma somaraju

AP Elections: సెలవులో తాడిపత్రి ఆర్ఓ

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ పై మరో సారి విమర్శలు గుప్పించిన వైఎస్ షర్మిల

sharma somaraju

ఇంత‌కీ మాచ‌ర్ల‌లో ఎవరు గెలుస్తున్నారు… ఆ విజేత ఎవ‌రు…?

మూడు పార్టీల కూట‌మిలో ఈ డౌట్ ఎందుకు… అస‌లెందుకీ మౌనం…?

వైసీపీ నేత‌ల్లో జోష్ ఏదీ… జ‌గ‌న్ ను న‌మ్మ‌డం లేదా.. ?