NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

హిందూపురంలో ఈ సారి బాల‌య్య‌కు కుదిరే ప‌నికాదా…?

టీడీపీ నాయ‌కుడు, న‌ట‌సింహం బాల‌య్య‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం హిందూపురంను లైట్ తీసుకున్నా రా? షెడ్యూల్ వ‌చ్చేసిన త‌ర్వాత కూడా.. ఇక్క‌డ బాల‌య్య క‌నీసం ఒక్క‌సారి కూడా ప‌ర్య‌టించ‌లేదు. షెడ్యూల్ వ‌చ్చేసి కూడా మ‌రో వారం రోజుల‌కు నెల అవుతోంది. అయిన‌ప్ప‌టికీ.. బాల‌య్య ఇక్క‌డివారితో ట‌చ్‌లో కి రాలేదు. తాను స్వ‌యంగా ఇక్క‌డ‌కు రాలేదు. దీంతో బాల‌య్య ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని లైట్ తీసుకున్నారా? ఎలాగైనా గెలిచేస్తాన‌ని అనుకున్నారా? అనేది చ‌ర్చ‌గా మారింది.

మ‌రోవైపు.. వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇక్క‌డ నుంచి బీసీ మ‌హిళ తిప్పేగౌడ నారాయ‌ణ దీపిక‌కు పార్టీ అవ‌కాశం ఇచ్చింది. ఆమె దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే మండ‌లాల వారీగా ప్ర‌చారం ముమ్మ‌రం చేశారు. పైగా అసంతృప్త నేత‌ల‌ను ఏకం చేస్తున్నారు. వారితో భేటీ అవుతున్నారు. వారిని బుజ్జ‌గిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో బాల‌య్య‌కు వ్య‌తిరేకంగా కూడా కామెంట్లు చేస్తున్నారు. సినిమాలు చేసుకునేందుకు ఉన్న శ్ర‌ద్ధ నియోజ‌క‌వ‌ర్గంపై ఏద‌ని నిల‌దీస్తున్నారు.

ఇది.. బాల‌య్య ఫ్యాన్స్‌కు న‌చ్చ‌క‌పోయినా.. క్షేత్ర‌స్థాయిలో మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. అంతేకాదు.. బాల‌య్య వ‌ల్ల ఈ ప‌దేళ్లుగా ఒరిగింది ఏమీ లేద‌ని కూడా చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల ప్ర‌జ‌లు బాల‌య్య‌కు వ్య‌తిరేకంగా.. దీపిక‌కు అనుకూలంగా జై కొడుతున్నారు. ఈ ప‌రిణామాలు బాల‌య్య‌కు ఇబ్బంది క‌లిగించేలా ఉన్నాయ‌ని అంటున్నారు. మ‌రోవైపు బాల‌య్య రాలేదు కాబ‌ట్టి మేం ఏం చేస్తామంటూ.. టీడీపీ నాయ‌కులు కూడా దూరంగా ఉన్నారు.

ఇక‌, కూట‌మి పార్టీలైన జ‌న‌సేన , బీజేపీలు కూడా.. బాల‌య్య‌కు దూరంగా ఉంటున్నాయి. బీజేపీని బాల‌య్య ఏమీ అన‌క‌పోయినా.. జ‌న‌సేన‌పై గ‌తంలో బాల‌య్య చేసిన వ్యాఖ్య‌ల‌ను వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో జ‌న‌సేన వ‌ర్గాలు కూడా దూరంగా ఉన్నారు. వీరిని ముందు స‌మ‌న్వ‌యం చేసుకోవాల్సిన అవ‌స‌రం బాల‌య్య‌కు ఉంది. అంతేకానీ, త‌న‌కు అచ్చొచ్చింది కాబ‌ట్టి ఇక్క‌డ గెలిచేస్తానంటే.. కుదిరే పనికాద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఎప్పుడు వ‌స్తారో చూడాలి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju