NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Pawan Kalyan: జగన్ సర్కార్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ అల్టిమేటమ్ .. 15 రోజుల్లో ఆ పని చేయకుంటే…

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జరిగిన సభలో ఓ అంశంలో వైసీపీ సర్కార్ కు అల్టిమేటమ్ జారీ చేశారు. ఇక్కడ నుండి గెలుపొందిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్  వైసీపీలోకి వెళ్లారనీ, అటువంటి ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ప్రభుత్వం, ఎమ్మెల్యే  పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజోలు ఎల్ఐసీ సెంటర్ లో ఉన్న బైపాస్ రోడ్డు అధ్వాన్నంగా తయారై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ రహదారిని 15 రోజుల్లో ప్రభుత్వం అభివృద్ధి చేయకపోతే శ్రమదానం ద్వారా తామే రోడ్డు వేస్తామని తెలిపారు. వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ .. రాజోలులో మీరు వెలిగించిన చిరు దీపం ఒక రోజున రాజంపేట దాకా వెలుగుతుందన్నారు.

Pawan Kalyan

 

150 సభ్యులతో స్థాపించిన జనసేన పార్టీ ఈ రోజు ఒక్క రాజోలు లోనే పదివేల క్రియాశీల కార్యకర్తలను సంపాందించుకుందని అన్నారు. నలుగురు గుండాలు అమలావురం నుండి దిండి మార్గంలో తనపై రాళ్లతో దాడి చేయబోయాలంటూ సంచలన కామెంట్స్ చశారు. క్రిమినల్ సంస్కృతిని గోదావరి జిల్లాలకు తీసుకురావద్దని వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జనసేన ఎదుగుదల ఎలా ఆపుతారో చూస్తానని ఛాలెంజ్ చేశారు. వైసీపీ ఇసుక దోపిడీ ఎదుర్కొకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ యే కాదు అని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాజోలు లో అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. పొయిన సారి ఎన్నికల్లో పట్టుమని పది మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉంటే అసెంబ్లీని ఊపేసే వాళ్లమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు వైసీపీ నుండి విముక్తి కలిగించాలని అది జరగాలంటే ముందు ఉభయ గోదావరి జిల్లాల్లో వేసీపీని జీరో చేయాలన్నారు. గోదావరి జిల్లాల్లో 34 సీట్లలో ఒక్క చోట కూడా వైసీపీ గెలవకూడదని అన్నారు.

కులాల సర్దుబాటు కోసమే తాను కుల ప్రస్తావన తెస్తున్నాను తప్ప రెచ్చగొట్టడానికి కాదని అన్నారు పవన్ కళ్యాణ్. ఓట్లు చీలిక ద్వారా ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్లు గెలుస్తున్నారన్నారు. 70 శాతం ప్రజలు వ్యతిరేకించిన వాళ్లు పదవిలోకి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని అన్నారు. రాష్ట్రంలో వంద మంది పన్నులు తీసుకుని 40 శాతం వైసీపీ వాళ్లకే లబ్ది చేస్తే ఎలా అని పవన్ ప్రశ్నించారు. సీఎం బటన్ నొక్కితే అందరికీ డబ్బులు పడుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రజలకు సరైన రోడ్లు వేయకుంటే ఎన్ని బటన్ లు నొక్కితే ఏమి లాభమని అని ఎద్దేవా చేశారు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు పవన్ కళ్యాణ్. జనసేన అధికారంలోకి వస్తే ముందుగా రహదారులు, వంతెనలు, రైల్వే లైన్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఓన్జీసీ, గెయిల్, రిలయన్స్, వేదాంత వంటి ఆయిల్ కంపెనీల్లో 70 శాతం యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తొందన్నారు. అలాగే ఆ ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్ డెవలప్ మెంట్ చేయడానికి విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కేరళ తరహాలో క్వాలిటీ విద్యను అందిస్తామని తెలిపారు. పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం తో పాటు తల్లిలాంటి మాతృభాషలో విద్యను అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

పచ్చని కోనసీమను పర్యాటక కేంద్రంగా, ఉభయ గోదావరి జిల్లాలను అధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స చేయిస్తామన్నారు. దీనికి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా ఆలోచన చేస్తున్నామన్నారు. షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 500 మంది చొప్పున యువతను దామాషా పద్దతి ప్రకారం ఎంపిక చేసి పది లక్షల ఆర్ధిక సాయం అందించి వారిని పారిశ్రామిక వేత్తలుగా మార్చడం తో పాటు పది మందికి ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ హమీ ఇచ్చారు.

Telangana BJP: బీఆర్ఎస్ తో దోస్తీ ఉండదు.. ఇక యుద్దమేనని చెప్పిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju