NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Video Viral: ఐక్యతలో అనైక్యత .. కురుబ సంఘం గుడికట్ల సంబరాల్లో నేతల మధ్య వాగ్వివాదం.. వీడియో వైరల్

Share

Video Viral:  ఓ పక్క కురుబ సంఘం ఐక్యత వర్ధిల్లాలి అంటూనే మరో పక్క నేతలు వాగ్వివాదానికి దిగడంతో ఐక్యత ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. కురుబ సంఘం నేతల వాగ్వివాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కురుబల ఐకమత్యం కోసం ఏర్పాటు చేసిన వేదికపైనే ఐక్యత లేక తోసుకున్నారు అంటూ నెటిజన్లు సెటైర్ వేస్తున్నారు. కురుబ సామాజికవర్గానికి చెందిన నాయకులు గుడికట్ల ఉత్సవాల సాక్షిగా వేదికపై ఒకరికొకరు దూషించుకున్నారు. ఎంతో పవిత్రంగా నిర్వహించాల్సిన కార్యక్రమం రసాభాసగా ముగిసింది.

అనంతపురంలో జరిగిన కురుబల గుడికట్ల సంబరాల్లో కురుబ సామాజికవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు మంత్రి ఉష శ్రీ చరణ్, మాజీ మంత్రి శంకర నారాయణ, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా టీడీపీ నేత బీకే పార్ధసారధి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అయితే వేదికపై ఎటువంటి రాజకీయ ప్రసంగాలు ఉండవు అని, కేవలం పూజా కార్యక్రమాలు, ఇతర సాంస్కృతి వ్యవహారాలు నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మైక్ తీసుకుని కురుబలు ఐక్యంగా ఉన్నారనీ, కానీ నాయకులే సరిగా లేరని, అందుకు సభలో ఉన్న నాయకులే నిదర్శనమని వ్యాఖ్యానించారు. దీనికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్ధసారధి కౌంటర్ ఇవ్వడంతో ఇరువురి మధ్య వాదన జరిగింది. మైక్ లాక్కునే ప్రయత్నం చేయడంతో .. కాసేపు అరుపులు, కేకలతో వేదిక గందరగోళంగా మారింది.

అంతే కాకుండా వేదికపై బీకే పార్ధసారధిని పలువురు గజమాలతో సత్కరించారు. ఆ క్రమంలో ఎంపీ మాధవ్ కూడా ఆ గజమాల మెడలో వేసుకునే ప్రయత్నం చేయడంతో పార్ధసారధి ఆ మాలను తోసేశారు. ఆ తర్వాత ఇద్దరు నేతల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇలా నేతల అనుచరుల మధ్య మాటల యుద్దం తోపులాటకు దారి తీసింది. పోలీసులు, నాయకులు సర్దిచెప్పడంతో గొడవ కొద్ది సేపటికి సద్దుమణిగింది. దీంతో అక్కడ నుండి మంత్రి ఉష శ్రీ చరణ్, ఎంపీ గోరంట్ల మాధవ్ తమ వర్గీయులతో అక్కడి నుండి వెళ్లిపోయారు.

రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో మాత్రమే కురుబ సామాజికవర్గం అధికంగా ఉంది. ఎన్నికల సమయంలో  నియోజకవర్గాల్లో అభ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఈ సామాజికవర్గం ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వైసీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి అవకాశం ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ బీకే పార్ధసారధికి అవకాశం కల్పించింది. అయితే ఒకే సామాజికవర్గం అయిన నేతల మధ్య రాజకీయంగా విభేదాలు కొనసాగుతున్నాయి. కురుబ సామాజికవర్గంలోని జిల్లా నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి అధిపత్యం కోసం గొడవలకు దిగడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

YS Jagan: ‘మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్దికి ఇదే నిదర్శనం’


Share

Related posts

ఇండియాలో ఇంటర్నెట్ వ‌చ్చిన తొలినాళ్ల‌లో.. చార్జీలు ఎలా ఉండేవో తెలుసా..?

Srikanth A

Tollywood: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులకు.. నిర్మాతలకు కొత్త తలనొప్పి..??

sekhar

టీడీపీ నేత చింతకాయల విజయ్ కి ఏపి సీఐడీ నోటీసులు ..స్పందించిన చంద్రబాబు, లోకేష్

somaraju sharma