NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

LPG Gas : గ్యాస్ వినియోగదారులకు మరో సారి షాక్..

LPG Gas : ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరో వైపు వంట గ్యాస్ సిలెండర్ ధరలు అమాంతం పెరుగుతుండటం సామాన్యులకు మరింత భారం అవుతోంది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ సామాన్యులపై భారం పడేలా ధరలు పెరుగుతుండటంతో గృహిణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

LPG Gas rates hike
LPG Gas rates hike

ఒకే నెలలో మూడు సార్లు వంట గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగాయి. తాజాగా నేడు వంట గ్యాస్ సిలెండర్ పై రూ.25లు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.  పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.

ఈ నెల నాల్గవ తేదీన సిలెండర్ పై రూ.25 లు పెంచగా, ఆ తరువాత 15వ తేదీన మరో రూ.50లు పెరిగింది. ఇప్పుడు మరో సారి రూ.25లు పెంచడంతో ఈ నెలలో మొత్తం రూ.100లు పెరిగినట్లు అయ్యింది. ప్రస్తుతం వంట గ్యాస్ సిలెండర్ ధర రూ.818లకు చేరింది. వివిధ ప్రాంతాల్లో రెండు మూడు రూపాయల వ్యత్యాసం ఉంటుంది.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఆ ప్రభావం నిత్యావసర వస్తువులపైనా పడుతోంది. రవాణా చార్జీలు పెరగడంతో  నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల పేద, మధ్యతరగతి వర్గాలకు పెనుభారం అవుతున్నాయి.

రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 10వ తేదీన జరగనుంది. వివిధ రాజకీయ పక్షాల నేతలు అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పురపాలక సంఘ ఎన్నికలు అయిన వెంటనే ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమ్మతి తెలియజేసింది. కోర్టులో వచ్చే తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ చర్యలు చేపట్టనున్నది. ఎన్నికల వేళ నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటంతో ప్రజలు నేతలను నిలదీసే పరిస్థితులు ఎదురవుతున్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!