NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: ముగిసిన లోకేష్ సీఐడీ విచారణ .. విచారణపై లోకేష్ ఏమన్నారంటే..?

Share

Nara Lokesh: మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సీఐడీ రెండవ రోజు విచారణ ముగిసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న ఆరు గంటల పాటు విచారించిన సీఐడీ అధికారులు, ఇవేళ కూడా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం లోకేష్ మీడియాతో లోకేష్ మాట్లాడారు. హైకోర్టు ఒక్క రోజే విచారించాలని చెప్పినా రెండో రోజు కూడా విచారణకు పిలిచారన్నారు. ఈ రోజు 47 ప్రశ్నలు అడిగారనీ, సంబంధం లేని ప్రశ్నలే పదేపదే అడిగారని చెప్పారు. వాషింగ్ మిషన్ లో వేసి తిప్పినట్లుగా మంగళవారం అడిగిన ప్రశ్నలే తిప్పి తిప్పి అడిగారన్నారు. ఈ కేసులో నిందితురాలు కాని తమ అమ్మ భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ చూపించి ప్రశ్నించారన్నారు. ఆమె ఐటీ రిటర్న్స్ మీ వద్దకు ఎలా వచ్చాయని దర్యాప్తు అధికారిని అడిగితే సమాధానం చెప్పలేదన్నారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.

ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి నాలుగైదు ప్రశ్నలు మాత్రమే అడిగారన్నారు. తన నిర్వహించిన శాఖకు సంబంధం లేని ప్రశ్నలే పదేపదే అడిగారన్నారు. ఈ కేసులో మరో సారి లేఖ ఇస్తారా అని దర్యాప్తు అధికారిని అడిగితే సమాధానం చెప్పలేదన్నారు. లింగమనేని రమేష్ కు చెల్లించిన అద్దె చెల్లింపులపై ప్రశ్నించారన్నారు లోకేష్. రమేష్ ఇంట్లో అద్దెకు ఉంటూ రూ.27 లక్షలు రెంటల్ అడ్వాన్స్ కట్టారనీ, అందుకు సంబంధించి ఐటీ రిటర్న్స్ లో లేదని చెప్పారనీ, దీనికి సంబంధించి ఆడిటర్ లను అడగాలని చెప్పానన్నారు. ఇంట్లో ఉండి అద్దె చెల్లిస్తే క్రిడ్ ప్రోకో ఎలా అవుతుందని ప్రశ్నించారు లోకేష్. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పై సీఐడీ ఓ సినిమా చూపించిందని ఎద్దేవా చేశారు.  రెండు రోజుల పాటు తన సమయం వృధా చేశారన్నారు.

మరో పక్క ఈరోజే మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ ను కూడా ఇన్నర్ రింగ్ కేసులో సీఐడీ విచారణ చేసింది. నారా లోకేష్, పునీత్ మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన సీఐడీ విచారణ చేసింది. సీఐడీ విచారణ నోటీసులపై పునీత్ నిన్న హైకోర్టును ఆశ్రయించగా, న్యాయవాదితో విచారణ కు హజరు కావాలని ఆదేశించింది. దీంతో పునీత్ ఇవేళ సీఐడీ అధికారుల ముందు విచారణకు హజరైయ్యారు. తొలి రోజు విచారణ పూర్తి అయన తర్వాత పునీత్ ను రేపు కూడా విచారణకు రావాలని తెలిపారు.

YSRCP: సీఎం జగన్ ఆలోచన మామూలుగా లేదుగా..! పకడ్బందీ వ్యూహాలతో కార్యక్రమాలు..!!


Share

Related posts

నలభై ఏళ్ల అనుభవం..! పనబాక లాంటోళ్లు ఎంత మందో..? ఏం బాబు..!?

Muraliak

అర్జున్ రెడ్డి ని మించిన సినిమా ఇది .. టీజర్ అద్దిరిపోయింది – ‘ కుల వ్యవస్థ ‘ ని ప్రశ్నించిన మొనగాడు..!

GRK

చిన్న పామునైనా పెద్ద కర్తతో కొట్టాలన్న సామెత మాదిరిగా.. నెల్లురు రూరల్ లో కోటంరెడ్డికి ఆ బిగ్ షాట్ తో చెక్ పెట్టిన వైసీపీ

somaraju sharma