NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YSRCP: సీఎం జగన్ ఆలోచన మామూలుగా లేదుగా..! పకడ్బందీ వ్యూహాలతో కార్యక్రమాలు..!!

Share

YSRCP:  ఏపీలో ముందస్తు అంటూ లేదు. షెడ్యుల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ షెడ్యుల్ ప్రకటించడంతో ఆ విషయం తేలిపోయింది. గత కొంత కాలంగా తెలంగాణతో పాటే ఏపీ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. సీఎం జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ఓ సెక్షన్ మీడియాలో ముందస్తు అనుమతికే వెళ్లారంటూ ప్రచారం కూడా జరిగింది. పలు సందర్భాల్లో ముందస్తుకు వెళ్లే ఆలోచన లేదంటూ అధికార వైసీపీ స్పష్టం చేస్తూనే ఉంది. మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను వైసీపీ సన్నద్దం చేస్తొంది.

ఈ క్రమంలో భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. రీసెంట్ గా ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత విజయవాడలో వైసీపీ ప్రతినిధులతో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, నేతలు మొదలు కొని జిల్లా స్థాయి వరకూ నేతలను ఆహ్వానించి సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అవినీతి కేసులో అరెస్టు చేయించి జైల్ కు తరలించడం ద్వారా ఆ పార్టీ నెల రోజులుగా నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. మరో వైపు జనాల్లోకి విస్తృతంగా వెళ్లేందుకు వైసీపీ ప్లాన్ సిద్దం చేసింది. మొదటి నుండి వైసీపీ ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీకి మైలేజ్ ఇచ్చేలా నిర్వహిస్తూ వస్తొంది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

YSRCP

గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు గ్రామాల్లో ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ ఎవరికి ఎంత మేలు జరిగిందో వివరిస్తున్నారు. రీసెంట్ గా నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సర్వసభ్య సమావేశంలో మరో మూడు నెలల పాటు నిర్వహించే కార్యక్రమాలపై సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నేతలు పాల్గొనాలని సూచించారు. ఇక ఈ నెల 26వ తేదీ నుండి వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది అని జగన్ ప్రకటించారు. ఈ బస్సు యాత్రకు సామాజిక బస్సు యాత్ర అని పేరు పెట్టారు.

YSRCP

ప్రతి నియోజకవర్గంలో ఒక మీటింగ్ ఖచ్చితంగా ఉండేలా బస్సు యాత్ర సాగుతుంది. అలాగే రాష్ట్రంలో మూడు ప్రాంతాలను కవర్ చేస్తూ రోజు మూడు  మీటింగ్స్ తక్కువ కాకుండా రెండు నెలలలో ఈ బస్సు యాత్ర పూర్తి చేయాలని ఆదేశించారు.  ఈ బస్సు యాత్ర సజావుగా సాగేలా చూడాల్సిన బాధ్యతను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ల తో పాటు ప్రాంతాల వారీగా సీనియర్ నేతలకు బాధ్యులుగా నియమించారు. ఇక బస్సు యాత్ర ప్రతి నియోజకవర్గంలో జరిగేలా, ఎమ్మెల్యే, ఇన్ చార్జితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన నాయకులు అంతా వేదిక మీదకు వచ్చి ప్రసంగించాలని జగన్ సూచించారు. వైసీపీ ప్రభుత్వం గడచిన 52 నెలల్లో ఏమి చేసింది అన్నది ప్రజలకు సవివరంగా తెలియజేసేలా సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వహించాలని సూచించారు.

YSRCP

ప్రతి పేదవాడు వైసీపీ మన పార్టీ అన్న విధంగా చూడాలని, ఆ దిశగా వారు ఓన్ చేసుకునేలా పార్టీ మొత్తం వారి వద్దకు చేరి ప్రజలకు జరిగిన మేలు వివరించాలని జగన్ స్పష్టం చేశారు. మరో పక్క నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకూ వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ వివరాలు తెలియజేసేలా బోర్డులను ఆవిష్కరించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు గ్రామాల్లో పెద్దల ఇంటికి వెళ్లి వారితో సమావేశం అయి వారి ఆశీస్సులు, దీవెనలు తీసుకోవాలని చెప్పారు జగన్.

ఆ తర్వాత డిసెంబర్ 11 నుండి జనవరి 15వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆడుదాం .. ఆంధ్రా కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. ప్రభుత్వం నిర్వహించే క్రీడా సంబరం ఆడుదాం .. ఆంధ్ర. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించనున్నారు. ఈ కార్యక్రమంలోనూ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని సూచించారు. ఆ తర్వాత జనవరి 1వ తేదీ నుండి మరో మూడు కార్యక్రమాలు మొదలు అవుతాయని చెప్పారు. ఫిబ్రవరిలో మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి చేసుకుందామని, ప్రతి ఇంటికి మన మేనిఫెస్టోను తీసుకువెళ్లాలని, ఆ తర్వాత మార్చిలో ఎన్నికలకు సన్నద్దం అవుతామని జగన్ చెప్పారు. వరుసగా ఈ ఆరు నెలలు పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నేతలు ప్రజల్లో మమేకం అవుతూ కార్యక్రమాల్లో పాల్గొనేలా యాక్షన్ ప్లాన్ రూపొందించింది వైసీపీ.

YS Viveka Case:  వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టులో మరో సారి ఊరట ..  ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు


Share

Related posts

మనిషికి సేవ చేస్తే దేవుడికి చేసినట్టు ఎలా అవుతుంది ?

Kumar

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా గోపూజ మహోత్సవాలు.. సంబరాల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

somaraju sharma

మడమ ‘తిప్పిన’ జగన్ .. కీలక నిర్ణయం వెనక్కి – ఆఖరినిమిషం ట్విస్ట్ ! 

sekhar