NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఏపి సీఎం వైఎస్ జగన్ ను కలిసిన నోబెల్ గ్రహీత ఎస్తేర్ ఢప్లో..జగన్ పనితీరుకు ప్రశంసలు

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ని నోబెల్ గ్రహీత, ఫ్రెంచ్ – అమెరికన్ ఆర్ధిక వేత్త ఎస్తేర్ ఢప్లో కలిశారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆమె సోమవారం జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందనలు తెలియజేశారు. అభిజిత్ బెనర్జీ, మైఖెేల్ క్రీమెర్ తో కలిపి ఎస్తేర్ డఫ్లో 2019 లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్ (జే – పాల్) కి సహా వ్యవస్థాపకురాలిగా ఆమె వ్యవహరిస్తున్నారు. సీఎం జగన్ తో భేటీ అనంతరం ఎస్తేర్ డఫ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ,సమావేశమైయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, తీరు తెన్నులను ఎస్టేర్ డఫ్లోకు అధికార యంత్రాంగం వివరించింది.

Nobel laureate Esther duflo meet AP CM YS Jagan
Nobel laureate Esther duflo meet AP CM YS Jagan

 

అనంతరం ఎస్టేర్ ఢప్లో మీడియాతో మాట్లాడుతూ సీఎంతో నిర్మాణాత్మకంగా చాలా చక్కటి సమావేశం జరిగిందన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి తెలుసుకున్నామన్నారు. వివిధ అంశాలపై భవిష్యత్తులో వారితో కలిసి పనిచేయడంపైనా దృష్టిపెడతామని చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం చేస్తున్న కార్యక్రమాలను సీఎం వివరించారని అన్నారు. వారి కనీస అవసరాలను తీర్చడానికి, సుస్థిర ఆర్థిక ప్రగతికోసం, చేపడుతున్న కార్యక్రమాల గురించి చెప్పారన్నారు. ఇదే సందర్భంలో తన స్వీయ అనుభవాలనుకూడా సీఎం మాతో పంచుకున్నట్లు తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంచడమనే లక్ష్య సాధనలో వారితో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పథకాలు విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కున్న పరిజ్ఞానం తమను అకట్టుకుందని తెలిపారు. గడచిన 15 ఏళ్లుగా వివిధ రంగాల్లో జె–పాల్‌ పనిచేస్తోందనీ, ఇప్పటికే 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో పైలట్‌ ప్రాజెక్టు కింద కొన్ని అంశాల్లో పనిచేస్తున్నామన్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N