NewsOrbit
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Perni Nani at Polavaram: ఓవర్ యాక్షన్@ ఏపి పోలీస్..! ప్రజల పెయిన్ గుర్తించండి సీఎం గారూ..!!

Perni Nani at Polavaram: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నిన్న జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయ్యింది. పోలీసుల అతి ప్రవర్తనపై మంత్రి పేర్ని నాని విరుచుకుపడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. విషయం ఏమిటంటే.. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లు నిన్న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి వచ్చే కార్యక్రమానికి సహజంగానే జిల్లా ఇన్ చార్జి మంత్రి, ఆ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు హజరవుతుంటారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని వ్యవస్థలు నడుచుకుంటున్న తీరు అనుమానాస్పదంగా, హాస్యాస్పదంగా, ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. నిన్న సీఎం పర్యటనలో సాక్షాత్తు ఇద్దరు మంత్రులకు అవమానం జరిగింది. మంత్రులు పోలీసులపై సీరియస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వ్యవహారాల్లో తప్పు ఎవరిది..? నిజంగా మంత్రి పేర్ని నానిదే తప్పు ఉందా..? వైసీపీ వ్యతిరేక మీడియాల్లో మంత్రి పేర్ని నానిని ట్రోల్ చేస్తున్నారు. అక్కడ జరిగిన వాస్తవం ఏమిటి..? అనేది ఒక సారి పరిశీద్దాం..

Perni Nani at Polavaram police overaction
Perni Nani at Polavaram police overaction

Perni Nani at Polavaram: భద్రతపై అవసరానికి మించి

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ బయటకు వచ్చిన సందర్భాల్లో పోలీసు యంత్రాంగం విపరీతమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అవసరానికి మించి పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ విశాఖ వెళ్లిన సందర్భంలోనూ పోలీసులు ఎయిర్ కు వెళ్లే రహదారిపై మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలుపుదల చేశారు. దీని వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అది పెద్ద ఇష్యూ అయ్యింది. దీనిపై సీఎం జగన్ కూడా స్పందించారు. ఇకపై పోలీసులు ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కల్గించవచ్చని చెప్పారు. అంతకు ముందు నాలుగైదు నెలల క్రితం సీఎం ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో పర్యటించారు. సీఎం జగన్ ఒంగోలు పట్టణానికి దూరంగా ఉన్న పివిఆర్ గ్రౌండ్స్ కు వెళుతుండగా, ఆ పివిఆర్ గ్రౌండ్స్ కు ఏ మాత్రం సంబంధంలేని సుజాతనగర్ ఏరియా, హైవే ఏరియా, మంగమూరు డొంక వద్ద ఉన్న జంక్షన్ వద్ద అంటే పిఆర్ఆర్ గ్రౌండ్ కు అయిదు కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలోనూ సాధారణ ప్రజల రాకపోకలను పోలీసులు ఆపేశారు. సీఎం జగన్ వచ్చేది ఎక్కడ..! వెళ్లేది ఎక్కడ..! పోలీసులు ప్రజలను ఆపుతున్నది ఎక్కడ..!. సాధారణ ప్రజానీకాన్ని అంత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏమిటి..? అన్న ప్రశ్న ఉత్పత్నం అవుతోంది. సాధారణ ప్రజలు తీవ్ర వాదులా..? ఉగ్రవాదులా..? ఎందుకు ఇలా చేస్తున్నారో పోలీసులకే తెలియాలి.

CM YS Jagan 1000 Days: How Many Marks..!?

Perni Nani at Polavaram: మంత్రి పేర్ని నాని సీరియస్

అదే విధంగా తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసు నుండి జగన్ ఉదయం 9.30గంటలకు బయలుదేరుతుంటే రోడ్డు మీద 8 గంటల నుండే ట్రాఫిక్ ఆపేస్తున్నారు. ఆయన వెళ్లిపోయిన తరువాత కూడా అరగంట వరకూ ట్రాఫిక్ వదలరు పోలీసు. సీఎం వెళ్లే రోడ్లుకు అనుసంధానంగా ఉన్న రహదారులపై పూర్తిగా వాహనాలను, ప్రజలను ఆపేస్తుంటారు. గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. నిన్న మంత్రులు కూడా ఇబ్బందిపడాల్సి వచ్చింది. సీఎం పర్యటనలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు పేర్ని నాని, ఆళ్ల నాని లకు చెందిన వాహనాలు రోడ్డు పక్కన పెడితే పోలీసులు వచ్చి మంత్రుల కార్లనే అక్కడి నుండి తీసేయాలని ఆదేశించారు. అక్కడ పోలీసులకు సంబంధించి సీఐ, డీఎస్పీ వాహనాలు ఉన్నాయి. అక్కడ మంత్రులకు సంబంధించిన వాహనాలు పెడితే వద్దని పోలీసులు అన్నారు. దీంతో పోలీసులపై మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. ఇక్కడ వెహికల్స్ ఎందుకు వద్దు..? మీ వాహనాలు ఉంటే తప్పులేనిది మా వాహనాలు ఉంటే తప్పేంటి..? అని ప్రశ్నించారు. అటు పోలీసులు గానీ ఇటు మంత్రులుగానీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్లే. ఇంకా మంత్రులకు ప్రోటోకాల్ ఉంటుంది. మంత్రి కారును అక్కడ నుండి తీయమని పోలీసులు అన్నందున మంత్రి పేర్ని నాని వాళ్లపై సీరియస్ అయ్యారు.

సాధారణ ప్రజానీకం రెండున్నరేళ్లుగా పడుతున్న బాధ

అయితే ఇక్కడ మంత్రి అనుభవించిన పెయిన్ కంటే సాధారణ ప్రజల్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సీఎం గారు ఎక్కడో తిరుగుతుంటే మా వాహనాలు ఇక్కడ ఎందుకు అపుతున్నారు అంటూ ప్రజలు గొంతు చించుకుని అరిచిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. తాడేపల్లి ఏరియాలో ఒక గర్బవతి ఆటోలో ఉండి ఆసుపత్రికి వెళ్లాలంటే కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఓ ముసలాయన పోలీసుల కాళ్లా వేళాపడినా వదలలేదు. ఆ తరువాత సీఎం రావడానికి ఆలస్యం అవుతుందని తెలిసి ఓ పక్క దారి వదిలారు. ఇవన్నీ కూడా పోలీసుల ఓవర్ యాక్షన్ కు నిదర్శనంగా కనబడుతున్నాయి. పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా సాధారణ ప్రజానీకం రెండున్నరేళ్లుగా పడుతున్న బాధ నిన్న మంత్రి పేర్ని నానికి తెలిసివచ్చింది. ఇక్కడ మారాల్సింది మంత్రులు కాదు. పోలీసుల చర్యలను ట్రోల్ చేయాలి. పోలీసుల ఓవర్ యాక్షన్ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. దీనిపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

author avatar
Srinivas Manem

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju