YS Sharmila: వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమై ఈ మేరకు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. తాజాగా లోటస్ పాండ్‌లో టీం వైఎస్ఎస్సార్ వెబ్ సైట్ ప్రారంభోత్సవంలో షర్మిల పాల్గొన్నారు. తెలంగాణలో రాజన్నరాజ్యమే లక్ష్యంగా ముందుకు సాగుదామని ప్రకటించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆదిలోనే ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. ఇటు రాజకీయంగా అటు పార్టీ పరంగా ఆమె చిక్కుల్లో పడ్డారు.
Read More: KCR: కేసీఆర్ బీపీ పెంచేస్తున్న ఇద్దరు ముఖ్యులు ఎవరంటే…
ఆ ముఖ్య నేత గుడ్ బై…
తెలంగాణ వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చారు. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఏప్రిల్ 3వ తేదీన ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పంపారు. వైఎస్ షర్మిల పార్టీలో కీలకంగా పనిచేస్తారని అనుకుంటున్న సమయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న గట్టు శ్రీకాంత్ రెడ్డి నేడు బీజేపీ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో గట్టు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయనతో పాటు హుజూర్‌నగర్‌కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా బీజేపీ చేరనున్నట్టు తెలుస్తోంది.
Read More: KCR: ఇంకో ప్రతిష్టాత్మక నిర్మాణం కూల్చివేత… భారీ ఆస్పత్రి కట్టనున్న కేసీఆర్

వివాదంలో షర్మిల…
కరోనా నిబందనల పాటించే విషయంలో వైఎస్ షర్మిల తన తీరు మార్చుకోవడం లేదు. గతంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలు, ఉద్యోగ దీక్ష, జిల్లాల పర్యటనల్లోనూ కూడా షర్మిల మాస్క్ వేసుకోకపోవడం గమనార్హం. దీంతో పాటుగా తాజాగా జరిగిన విషయంలో ఆమె మాస్క్ పెట్టుకోలేదు. దీంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.