NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: రేపు సుప్రీంలో తీర్పు .. ఆ అధికారులతో జగన్ అత్యవసర భేటీ..!

Share

Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు గత 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్, ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై శుక్రవారం తీర్పులు వెల్లడి అయ్యే అవకాశం ఉన్నట్లుగా న్యాయవాద వర్గాలు భావిస్తున్నాయి. క్వాష్ పిటిషన్ కు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ఇరు పక్షాలు వాదనలు విన్న దర్మాసనం బుధవారంతో వాదనలు ముగించి తీర్పు రిజర్వు చేసింది.

శుక్రవారం క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పై ఉత్తర్వులు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ  తరుణంలో సీఎం వైఎస్ జగన్ పలువురు ఉన్నత స్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి తో పాటు మరి కొందరు అధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. సీఎం జగన్ అధికారులతో ఈ తరుణంలో ఏఏజీ డీజీపీతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో చంద్రబాబుకి అనుకూలంగా తీర్పు వస్తే ఏమి చేయాలి అనే అంశంపై చర్చ జరిగినట్లుగా తెలుస్తొంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల పాటు 144 సెక్షన్ విధించాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఒక వేళ చంద్రబాబు విడుదల అయితే ఆ పార్టీ శ్రేణులు రోడ్డు షోలు, ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉన్నందున వాటిపై కఠిన ఆంక్షలు విధించాలని భావిస్తున్నారుట. రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలగకుండా చూసుకోవడం, ప్రజలు రోడ్డు మీదకు రాకుండా నిలువరించడం లాంటి అంశాలపై డీజీపీతో చర్చించారని ప్రచారం జరుగుతోంది. డీజీపీతో పాటు ఏఏజీతో కూడా సమీక్ష జరపడంతో న్యాయపరమైన అంశాలపైనా చర్చించారని అంటున్నారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపైనా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన విషయాలపైనా చర్చించి ఉండవచ్చని అనుకుంటున్నారు.

కాగా, చంద్రబాబు రిమాండ్ గడువు  గురువారం (19వ తేదీ)తో ముగియడంతో ఆయనను వర్చువల్ గా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంలో న్యాయమూర్తి .. ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంలో తన ఆరోగ్య సమస్యలతో పాటు జైలులో తన భద్రత విషయంలో అనుమానాలు ఉన్నాయని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. అనుమానాలు ఉంటే వ్రాతపూర్వకంగా ఇవ్వాలని ఆయనకు న్యాయమూర్తి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు సీల్డ్ కవర్ లో అందించాలని జైలు అధికారులకు న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం చంద్రబాబు రిమాండ్ ను నవంబర్ 1వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

CM YS Jagan: విజయ దశమి శుభాకాంక్షలుగా అర్చకులకు ఏపీ సీఎం జగన్ గుడ్ న్యూస్


Share

Related posts

Pawan Kalyan : మరోసారి సింగర్ గా పవన్ కళ్యాణ్..!! 

sekhar

ప్రభాస్ – యాష్ – అల్లూ అర్జున్ లని మించేలా మహేశ్ బాబు పాన్ ఇండియా సినిమా : డైరెక్టర్ ఎవరో కాదు !

GRK

YSRCP: విజయసాయి రెడ్డికి పార్టీలో మరో కీలక పదవి ..మాజీ మంత్రి బాలినేనితో భేటీ ఎందుకంటే..?

somaraju sharma