NewsOrbit
Bigg Boss 7 Entertainment News సినిమా

Supritha Naidu: తల్లి కూతుళ్లను బిగ్ బాస్ వాడుకుని వదిలేసాడా? సుప్రీతా నాయుడు బిగ్ బాస్ ఎంట్రీ కథ వెనుక అసలు నిజం!

Bigg Boss 7 Telugu: Top character actress Surekha Vanis Daughter Suprita Naidu Entry in Big Boss

Supritha Naidu | Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు రసవత్తరంగా కొనసాగుతోంది. ఉల్టా ఫుల్టా ట్విస్టులతో బిగ్‌బాస్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ప్రతీ వారం కంటెస్టెంట్లు హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతూనే.. మరికొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, రీ ఎంట్రీలు ఇస్తున్నారు. ఇప్పటికే హాట్ హీరోయిన్ అశ్విని శ్రీ, అర్జున్ అంబటి, సింగర్ భోలే షావలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. టిక్ టాక్ స్టార్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నయని పావని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె వారం రోజులు కూడా హౌజ్‌లో కొనసాగలేదు. వచ్చిన వారంలోనే ఆమె హౌజ్‌ లోనుంచి ఎలిమినేట్ అయింది. అయితే పాత ఎలిమినేటేడ్ కంటెస్టెంట్లు దామిని, రతిక, శుభశ్రీలలో ఒకరిని హౌజ్‌లో పంపించేందుకు బిగ్‌బాస్ ప్లాన్ చేశాడు. ఈ మేరకు ఓటింగ్ కూడా జరిగింది. కానీ ఇక్కడే బిగ్‌బాస్ అసలు ట్విస్ట్ ఇచ్చాడు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయే వాళ్లనే హౌజ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు హోస్ట్ నాగార్జున తెలిపారు. మొదట శుభ శ్రీ హౌజ్‌లోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరి క్షణంలో హౌజ్‌లో అడుగు పెడుతోంది మాత్రం రతికా రోజ్ అనే తెలుస్తోంది.

Bigg Boss 7 Telugu: Top character actress Surekha Vanis Daughter Suprita Naidu Entry in Big Boss
Bigg Boss 7 Telugu: Top character actress Surekha Vanis Daughter Suprita Naidu Entry in Big Boss

బిగ్‌బాస్ హౌజ్‌లోకి సుప్రితా?
ఇక బిగ్‌బాస్ హౌజ్‌లోకి టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురు సుప్రితా నాయుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలానే ప్రచారం జరిగింది. అయితే ఆమె హౌజ్‌లో ఎంట్రీ ఇస్తుందని చాలా మంది అనుకున్నారు. సుప్రితా నాయుడు అభిమానులు సైతం ఫిక్స్ అయ్యారు. తమ ఫేవరేట్ నటి బిగ్‌బాస్ హౌజ్‌లోకి వస్తుందని అనుకున్నారు. కానీ పూర్తి సీన్ రివర్స్ అయింది. ఊహించని విధంగా ఆమె పేరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి తప్పించబడింది. దాంతో అందరూ షాకయ్యారు. బిగ్‌బాస్ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించారు. సుప్రియా నాయుడు ఫేమ్‌ను వాడుకున్నట్లు ఆరోపిస్తున్నారు. లేదా సుప్రితా నాయుడే పబ్లిసిటీ కోసం ఇలా చేసిందా? అనే డైలమాలో ఉన్నారు. మరికొందరు సుప్రితా నాయుడు బిగ్‌బాస్ హౌజ్‌లో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు.

Bigg Boss 7 Telugu: Truth Behind the entry of Surekha Vani's Daughter Supritha Naidu in Bigg Boss 7
Bigg Boss 7 Telugu: Truth Behind the entry of Surekha Vani’s Daughter Supritha Naidu in Bigg Boss 7

సుప్రితా నాయుడు బయోగ్రఫీ..
2001 ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్‌లో సుప్రితా నాయుడు పుట్టారు. ప్రస్తుతం ఆమె వయసు 23 సంవత్సరాలు. ఈమె తల్లిదండ్రులు సురేష్ తేజ, సురేఖ వాణి. సుప్రితా నాయుడు తల్లి సురేఖ వాణి సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత తల్లి బాటలోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదట్లో షార్ట్ ఫిల్మ్‌లో యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్‌ఫిల్మ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత పలు కవర్ సాంగ్స్‌లో ఆమె నటించారు.

Bigg Boss 7 Telugu: Truth Behind the entry of Surekha Vani's Daughter Supritha Naidu in Bigg Boss 7
Bigg Boss 7 Telugu: Truth Behind the entry of Surekha Vani’s Daughter Supritha Naidu in Bigg Boss 7

సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువ..
సుప్రితా నాయుడుకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువగానే ఉంది. కరోనా టైంలో ఫ్యామిలీతోనే ఉన్నారు. అప్పుడు టిక్‌టాక్ ద్వారా ఆమె తన తల్లి సురేఖ వాణితో కలిసి పలు ఫన్నీ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు చేసే వారు. అలా ఆమెకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. టిక్‌టాక్ బ్యాన్ అవ్వడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగు పెట్టారు. ఇందులోనూ ఆమె తన డైలీ యాక్టివిటీస్‌లను అప్లోడ్ చేసే వారు. సంప్రదాయ దుస్తులు ధరించి పద్ధతిగా కనిపిస్తూనే.. ట్రెండీగా లుక్కులతో యువతను తన వైపు తిప్పుకుంటోంది. తన తల్లితో కలిసి ట్రావెల్ చేయడం, షాపింగ్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. సుప్రితా నాయుడుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 600కే వరకు ఫాలొవర్స్ ఉన్నాయి. ఆ సంఖ్యను పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. డ్యాన్స్ వీడియోలు, ఫోటోలు అప్లోడ్ చేస్తూ.. తన అభిమానులకు దగ్గరగా ఉంటాయి.

Bigg Boss 7 Telugu: మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న రతిక..ఇంస్టాగ్రామ్ స్టోరీలో షురూ..!!

అయితే ఈ భామ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు. గత వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు సుప్రితా నాయుడు పేరు కూడా వినిపించింది. కానీ చివరి నిమిషంలో ఆమె పేరు ఎంపిక కాలేదు. దీనిపై సోషల్ మీడియాలో రూమర్స్ బాగానే వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ కావాలనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వలేదా? ఆమెకు బిగ్‌బాస్ వెళ్లడం ఇష్టం లేదా? అనే విషయాలపై స్పష్టమైన అవగాహన లేదు

 

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu