NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YSRCP: త్వరలో ఆ సీనియర్ బీసీ నేతకు కీలక పదవి ..?

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం నుండి అంకిత భావంతో పార్టీ అభ్యున్నతికే పని చేస్తున్న ఓ సీనియర్ బీసీ నేతకు మరో ప్రతిష్టాత్మక కీలక పదవి దక్కనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కూడా ఆయన వరించనున్నదని టాక్. టీటీడీ ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఆగస్టు 12తో ముగియనున్న నేపథ్యంలో టీటీడీ బోర్డు చైర్మన్, పాలకమండలి డైరెక్టర్ల ఎంపికపై సీఎం జగన్ దృష్టి సారించినట్లుగా తెలుస్తొంది. మరో పది నెలల్లో ఎన్నికలు ఉండటంతో సీనియర్ నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి సేవలను పూర్తిగా పార్టీకే వినియోగించుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారుట. ఇప్పటికే ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండు టర్మ్ లు టీటీడీ చైర్మన్ గా సేవలు అందించారు. టీటీడీ చైర్మన్ పదవిని వైవీ సుబ్బారెడ్డి తొలుత అయిష్టంగానే ఒప్పుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో రెండో సారి కొనసాగారు.

Tirumala

టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఇద్దరు ముగ్గురు నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తొంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరుల పేర్లు ఉన్నాయని అంటున్నారు. అయితే అయితే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుండి బోర్డు సభ్యుడుగా ఉన్నారు. తుడా చైర్మన్ హోదాలో ఎక్స్ అఫిషియో సభ్యుడుగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదనీ, తన స్థానంలో తన కుమారుడు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నాడని భాస్కరరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రతిపాదనను సీఎం జగన్ కూడా ఆమోదించారు. ఈ క్రమంలోనే అన్నమయ్య, తిరుపతి జిల్లా పార్టీ బాధ్యతలను కూడా చెవిరెడ్డికి అప్పగించారు సీఎం జగన్. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి తాజాగా ఓ కీలక పదవి లభించింది. శాసనసభ సభా హక్కుల కమిటీ చైర్మన్ గా నియమితులైయ్యారు భూమన. టీటీడీ నూతన చైర్మన్ ఎంపికకు ముందే ఆయనకు ఆ పదవి ఇవ్వడంతో ఈ రేసు నుండి తొలగిపోయినట్లు అయిపోయింది. మరో పక్క వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సారి కూడా టీటీడీ చైర్మన్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తే ప్రతిపక్షాల నుండి విమర్శలు వచ్చే అవకాశం కూడా ఉంది.

Jagan, Janga Krishnamurthy

అందుకే ఈ సారి బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ క్రమంలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన బీసీ నాయకుడు, వైసీపీకి అత్యంత కీలక నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేరును సీఎం జగన్ పరిశీలన చేస్తున్నారుట. టీడీపీ హయాంలో బీసీ (యాదవ) సామాజికవర్గానికి చెందిన నేత పుట్టా సుధాకర్ యాదవ్ కు చంద్రబాబు అవకాశం కల్పించారు. ఇప్పుడు జగన్మోహనరెడ్డి కూడా అదే ఫార్మలాలో యాదవ (బీసీ) సామాజికవర్గానికి చెందిన కీలక నేత జంగా కృష్ణమూర్తికి అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నారు. వైఎస్ మరణానంతరరం నుండి జగన్ వెంట నడిచిన జంగా కృష్ణమూర్తి ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారు. అయినా కూడా పార్టీ అభ్యున్నతికే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ క్రమంలోనే గురజాల నియోజకవర్గంలో ఆయన తీవ్రంగా శ్రమించారు. బలమైన టీడీపీ నాయకుడు యరపతినేని శ్రీనివాసరావును రెండు సార్లు ఓడించారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటటీ చేసిన జంగా కృష్ణమూర్తి.. యరపతినేని చేతిలో పరాజయం పాలైయ్యారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని జంగా కృష్ణమూర్తి భావించినా జగన్ సూచనల మేరకు పోటీ చేయకుండా ఆగారు. వైసీపీ అభ్యర్ధిగా నిర్ణయించిన కాసు మహేష్ రెడ్డి విజయానికి తీవ్రంగా కృషి చేశారు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు జంగాకు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త, బలమైన బీసీ సామాజికవర్గ నేత రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో త్వరలో రాజకీయ పార్టీని ఆరంభిస్తున్నారు. బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. రామచంద్ర యాదవ్ మీటింగ్ లకు పెద్ద సంఖ్యలో బీసీ వర్గాలకు చెందిన నేతలు హజరు అవుతున్నారు. ఈ తరుణంలో ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని యాదవ సామాజికవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి అప్పగించడం ద్వారా ఆ వర్గాలు దూరం కాకుండా మరింత దగ్గర అయ్యేందుకు ఉపయోగపడుతుందన్నది  వైసీపీ ప్లాన్ గా భావిస్తున్నారు.

YSRCP: వైసీపీ శ్రేణులకు సజ్జల కీలక సూచనలు

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju