NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం పెన‌మ‌లూరు. ఇక్క‌డ నుంచి టీడీపీ ఈ ద‌ఫా విజ‌యం ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ కూడా విడుద‌ల కాకుం డానే.. ఇక్క‌డ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీనికి వైసీపీ వ్య‌తిరేక‌త క‌న్నా.. ఇక్క‌డ నుంచి పోటీ చేస్తున్న మంత్రి జోగి ర‌మేష్‌పై వ్య‌క్తిగ‌తంగా పెరిగిపోయిన వ్య‌తిరేక‌తే ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు ప‌రిశీల‌కు లు. మ‌రోవైపు.. టీడీపీ నుంచి శ్ర‌మ‌కోర్చి టికెట్ ద‌క్కించుకున్న బోడే ప్ర‌సాద్‌పై సానుభూతి పెరిగింది.

జోగిర‌మేష్ విష‌యానికి వ‌స్తే..ఆ య‌న స్థానికుడు కాదు. పెడ‌న నుంచి పెన‌మ‌లూరుకు బ‌దిలీ అయ్యారు. పెడ‌న‌లో వ్య‌తిరేక గాలులు ఎక్కువ‌గా వీస్తున్న నేప‌థ్యంలో ఆయ‌నను సీఎం జ‌గ‌న్ ఇక్క‌డ‌కు తీసుకువ చ్చారు. మార్పు మంచిదే అయినా.. క్షేత్ర‌స్థాయిలో ఆయ‌న‌కు పెద్ద‌గా కేడ‌ర్ బ‌లం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. గ‌తంలో ఇక్క‌డ ఎమ్మెల్యేగా గెలిచిన కొలుసు పార్థ‌సారథి.. త‌న‌కు టికెట్ ఇస్తారో ఇవ్వ‌రో అని భావించి.. రెండేళ్లుగా పార్టీ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశారు.

ఇక‌, దీనికి ముందుకూడా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ర‌ని తెలిసి.. పార్టీలో అన్య‌మ‌న‌స్కంగానే ఉన్నారు. దీంతో వైసీపీ కేడ‌ర్ దెబ్బ‌తింది. పోనీ.. జోగికి వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉందా అంటే.. లేనేలేదు. పైగా ఆయ‌న‌పై అరాచ‌క శ‌క్తి అనే వాద‌న టీడీపీ వినిపిస్తోంది. ఇక్క‌డ బీసీల్లోనే బ‌లంగా ఉన్న మాజీ మంత్రి పార్థ‌సార‌థి సీటు పీకేసి మ‌రో బీసీ నేత, ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న జోగి ర‌మేష్‌కు సీటు ఇవ్వ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న యాద‌వ సామాజిక వ‌ర్గం అంతా టీడీపీ వైపు వెళ్లిపోయారు. ఇక పార్థ‌సార‌థి కూడా టీడీపీలోకి వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇక జోగి ర‌మేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నా ఇక్క‌డ ఆ వ‌ర్గం అంతా సంప్ర‌దాయంగా టీడీపీ స‌పోర్ట‌ర్లుగానే ఉన్నారు.

ఇక జోగి మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటిపైకి వంద‌ల మందిని తీసుకువెళ్లి ఘ‌ర్ష‌ణ పడాల‌ని ప్ర‌య‌త్నించ‌డం.. చంద్ర‌బాబుపై ఇష్టానుసారంగా మాట్లాడ‌డం వంటివి.. పెన‌మ‌లూరు ప్ర‌జ‌లు హ‌ర్షించ‌లేక పోతున్నారు. అప్ప‌ట్లో నే పార్టీల‌కు అతీతంగా చంద్ర‌బాబుకు అనుకూలంగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇలాంటి నాయ‌కుడిని గెలిపిస్తార‌నే స‌మ‌స్యే లేద‌ని.. టీడీపీ అంచ‌నా వేసింది. ఇదే ఇప్పుడు పెన‌మ‌లూ రులో క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. బోడే ప్ర‌సాద్ ఓడిపోయినా.. పార్టీని, ప్ర‌జ‌ల‌ను అంటిపెట్టుకుని ఉండ‌డం.. వివాదాల‌కు క‌డుదూరంగా రాజ‌కీయాలు చేయ‌డం.. అంద‌రినీ క‌లుపుకొని పోతుండ‌డం వంటివి ఇక్క‌డ బోడేపై సానుభూతిని పెంచేలా చేశాయి.

చంద్ర‌బాబు ఎలాంటి పిలుపునిచ్చినా నేనున్నానంటూ.. బోడే ముందుకు రావ‌డం, పార్టీ కేడ‌ర్‌ను కాపాడుకోవ‌డం వంటివి.. ఆయ‌న‌కు కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌లిసి వ‌స్తున్న అంశాలుగా చెబుతున్నారు ప‌రిశీల‌కులు. దీంతో ఇక్క‌డ టీడీపీకి పాజిటివ్ టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అంతే కాకుండా బోడే ఇక్క‌డ భారీ మెజార్టీతో గెలుస్తాడ‌ని కూడా ప‌లు స‌ర్వేలు చెపుతున్నాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N