NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

కూట‌మి పార్టీల్లో జోష్ పెరిగిందా? ఇక‌, క్షేత్ర‌స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న సందిగ్ధ‌త‌, అనుమానాలు తొల‌గి పోయాయా? క‌లిసి ప‌నిచేసేందుకు అంద‌రూ కార్యోన్ముఖులు అవుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపుడే ల‌క్ష్యంగా టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ క‌ల‌సి క‌ట్టుగా జ‌త క‌ట్టాయి. సీట్లు పంచుకున్నాయి. ఇంత వ‌రకు పై స్థాయిలో జ‌రిగిపోయింది. అధినేత‌లు కూర్చుని చ‌ర్చించుకున్నారు. చేతులు క‌లుపుకొన్నారు.

కానీ, ఇక‌, కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఓట్లు క‌ల‌వాలి. ఒక పార్టీ ఓట్లు మ‌రో పార్టీకి ప‌డాల్సి ఉంటుంది. ఇది క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు చేయాల్సిన ప‌ని. ఒక‌స్థానంలో టీడీపీ అభ్య‌ర్థిని నిల‌బెడితే.. ఆ అభ్య‌ర్థికి అనుకూలంగా బీజేపీ, జ‌న‌సేన ఓట్లు కూడా ప‌డాలి. అవి కూడా సైకిల్ గుర్తుకే ప‌డాలి. లేక‌పోతే.. ఈ పొత్తు పెట్టుకుని కూడా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఈ విష‌యాన్ని కాస్త లేటుగా గ్ర‌హించిన పార్టీల అధినేత‌లు..క్షేత్ర‌స్థాయి పై దృష్టి పెట్టారు.

ఎక్క‌డైతే.. కీల‌క‌మైన ఓటు బ్యాంకు ఉందో.. ఆ ప్రాంతాలు, నియోజ‌క‌వ‌ర్గాల‌పై ప్ర‌త్య‌కంగా స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు క‌ల‌సి ప‌నిచేలా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. అయితే.. పైకి ఎన్ని చెప్పినా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు క‌దులుతారో లేదో అన్న అనుమానం ఉండ‌డంతో ఉమ్మ‌డి స‌భ‌ల పేరుతో క‌ల‌సి క‌ట్టుగా నాయ‌కులే.. క‌ద‌న‌రంగంలోకి దిగారు. ఈ ఉమ్మ‌డి స‌భ‌ల‌కు భారీగానే స్పంద‌న ల‌భిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ఉమ్మ‌డి స‌భ‌లు నిర్వ‌హించారు. ఇవ‌న్నీ కూడా.. టీడీపీకి బ‌ల‌మైన జిల్లాలుగా ఉన్న ఉభ‌య గోదావ‌రి జిల్లాలే కావ‌డం గ‌మ‌నార్హం. అదేస‌య‌మంలో జ‌న‌సేన‌, బీజేపీల‌కు కూడా ఈ జిల్లాల్లో బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. పైగా ఈ రెండు ఉమ్మ‌డి జిల్లాల్లో సీట్లు కూడా 35 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో ఉమ్మ‌డి స‌భ‌ల‌కు ప్లాన్ చేసి.. వాటిని స‌క్సెస్ చేశారు. ఫ‌లితంగా ఇప్ప‌టి వ‌ర‌కు చేతులు క‌లుపుతారో లేదో అన్న బెంగ ఉన్న మూడు పార్టీల్లోనూ ఆశించిన మేర‌కు ఫ‌లితం అయితే క‌నిపించింది. అయితే.. ఇది ఇక్క‌డితో అయిపోవ‌డంకాకుండా.. రాబోయే 25 రోజుల్లో మ‌రిన్ని ఉమ్మ‌డి స‌భ‌లు నిర్వ‌హించ‌డం ద్వారా ఈ జోష్‌ను కొన‌సాగించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?