NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో ఈ జంపింగ్ జ‌పాంగ్‌లు గెలుస్తారా..!

రాజకీయ జంపింగుల‌కు పొలిటిక‌ల్ పాఠాలు బోధ‌పడ‌డం లేదు. గ‌తంలో ఏం జ‌రిగిందో.. ఇప్పుడు ఏం జ‌రుగుతోందో.. కూడా వారికి తెలిసి రావ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గానే ఉంటోంది. పైగా.. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. వెంట‌నే పార్టీల‌పైనా.. పార్టీ అధినేత‌ల‌పైనా దుమారం రేపేలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తెలంగాణ లో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒక పార్టీ నుంచి మ‌రోపార్టీలోకి జంప్ చేసి టికెట్ తెచ్చుకున్న‌వారు.. గెలుపు గుర్రం ఎక్కారు. ఇది వాస్త‌వ‌మే. కానీ, ఏపీలో అలా జ‌రుగుతుంద‌నే ఖాయం అయితేలేదు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి దీనినే క‌ళ్ల‌కు క‌ట్టింది.

2019లో 23 మంది జంపింగుల‌కు చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. వీరిలో కేవలం ఒక్క‌రు(అద్దంకి) మాత్రమే గెలుపు గుర్రం ఎక్కారు. ఇక‌, ఇప్పుడు చూస్తే.. ఆ 23 మందిలో ఈ ఒక్క‌డే పోలింగ్ క్షేత్రంలో ఉన్నారు. మిగిలిన వారు అడ్ర‌స్ కూడా లేకుండా పోయారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన జంపింగుల్లో ఒక్క‌రికి కూడా చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌లేదు. ఇక‌, ఇప్పుడు చూస్తే.. న‌లుగురు వైసీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వీరిలో ఇద్ద‌రికి మాత్ర‌మే చంద్ర‌బాబు అవ‌కాశం క‌ల్పించారు.

మిగిలిన ఇద్ద‌రికి టికెట్లు ఇవ్వ‌లేదు. వీరిలో మేక‌పాటి చంద్ర‌శేఖ్‌ర‌రెడ్డి (ఉద‌య‌గిరి) ప‌రిస్థితి ఎలా ఉన్నప్ప టికీ.. తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి మాత్రం ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. ఆమె ఈ ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించారు. కానీ, చంద్ర‌బాబు ఇచ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌లేదు. దీనికి కార‌ణం.. ప్ర‌జ‌ల నాడి ఆమెకు వ్య‌తిరేకంగా ప‌రుగులు పెడుతుండ‌డ‌మేన‌ని తెలుస్తోంది. అందుకే ఆమెకు టికెట్ రాలేద‌ని అంటున్నారు.

మ‌రోవైపు.. ఇలా జంప్ చేసిన వ‌చ్చిన నాయ‌కుల‌కు .. జ‌న‌సేన కూడా టికెట్ ఇచ్చింది. ఆర‌ణి శ్రీనివా సులుకు తిరుప‌తి, పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులుకు భీమ‌వ‌రం వంటివి ద‌క్కాయి. అయితే.. వీరిపైనా తీవ్ర విమ‌ర్శ‌లు.. వ్య‌తిరేక‌త‌లు పెల్లుబుకుతున్నాయి. దీంతో వీరు ఏమేర‌కు గెలుపు గుర్రం ఎక్కుతార‌నేది చూడాలి. ఇక్క‌డ ప్ర‌ధానంగా చూడాల్సింది.. జంపింగు నేత‌ల‌కు ఏపీ ప్ర‌జ‌లు, ఓట‌ర్లు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌రు. గ‌తంలో ఒక‌రిద్ద‌రు గెలిచినా.. వ‌క్తిగ‌తంగా వారు సంపాయించుకున్న ఇమేజే త‌ప్ప మ‌రొక‌టి కాదు. సో.. జంపింగులు నేర్వాల్సింది.. చాలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju