YCP MLA Nallapureddy: పుండు మీద కారం చల్లడం అంటే ఇదే కదా..? టాలీవుడ్ ను షేక్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..!!

Share

YCP MLA Nallapureddy: కరోనా ప్రభావం దేశ వ్యాప్తం అన్ని రంగాలపై పడిన విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి నుండి దాదాపు సుమారు ఏడాదిన్నర పాటు అన్ని రంగాలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. గత నాలుగైదు నెలలుగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా ప్రభావం అన్ని రంగాలతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీపైనా పడింది. షూటింగ్ లు నిలిచిపోయాయి. ధియేటర్ లు మూతపడ్డాయి. మరో పక్క ఏపిలో ప్రభుత్వానికి, సినీ వర్గాల మధ్య అంతర్ యుద్దం జరుగుతోంది. ఆన్ లైన్ టికెటింగ్ తీసుకురావడం, నిబంధనల మేరకే నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలని చెప్పడం, బెనిఫిట్ షోలకు అవకాశం లేదని చెప్పడం, అన్ని సినిమాలకు ఒకే ధరతో టికెట్లు అమ్మాలని చెప్పడం జరిగింది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అన్న తేడా లేదు. పెద్ద బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు అనే బేధం లేదు, ప్రభుత్వం దృష్టిలో అన్ని సమానమేనని ఏపి ప్రభుత్వం చెబుతోంది. టికెట్ల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలంటూ మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా టాలివుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కూడా ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టారు. ఇలా ఆంక్షలు పెడితే పెద్ద సినిమాల విడుదల, ధియేటర్ల మనుగడ దెబ్బతింటాయని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు ఏపి ప్రభుత్వం నుండి పెద్దగా సహకరిస్తుంది ఏమీ లేదు.

YCP MLA Nallapureddy viral comments
YCP MLA Nallapureddy viral comments

YCP MLA Nallapureddy: సినీ ప్రముఖులు వరద బాధితులకు సాయం అందించాలి

ఈ తరుణంలో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే సినీ పరిశ్రమ ప్రముఖులు, హీరోలు వరద బాధితులకు సాయం అందించాలని హుకుం జారీ చేయడం అటు సిని వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. సహజంగా ఏదైనా విపత్తు సమయంలో స్వచ్చందంగా ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలను అందజేయడం సంప్రదాయంగా వస్తుంది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపిలో నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా అపార నష్టం వాటిల్లితే ఫిలిం ఇండస్ట్రీకి చెందిన హీరోలు, పెద్దలు స్పందించకపోవడం దారుణమన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానం వల్ల ఎదిగిన హీరోలు ఈ రోజు వరద బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు రాకపోవడం బాధాకరమని అన్నారు.

చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రాఘవేంద్రరావు గానీ ఎవరూ స్పందిచలేదనీ, కనీసం ఒక్క స్టేట్ మెంట్ కూడా లేదని వారు స్పందించి ఉంటే బాగుండేదని అన్నారు. గతంలో వరదలు వచ్చిన సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు ప్రజలను ఆదుకున్నారని గుర్తు చేస్తూ ఇప్పుడు తాను పిలుపు ఇస్తున్నాననీ, బయటకు వచ్చి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏదో ఒక సహయం చేయాలని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి హీరోలకు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా నిర్మాతలు, డైరెక్టర్లు కూడా స్పందించాలని కోరారు. అధికార పార్టీ ఎమ్మెల్యే విజ్ఞప్తిపై హీరోలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


Share

Related posts

Life Span: వీటిని తింటున్నారా..!? మీ ఆరోగ్యానికి బోనస్ పాయింట్స్ ఇవే..!!

bharani jella

Rashmi Gautam At Lenin House First Anniversary

Gallery Desk

తాత్కాలిక కండక్టర్‌పై తాత్కాలిక డైవర్ అత్యాచారయత్నం?

somaraju sharma