NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: అధికార, విపక్ష పార్టీల మీటింగ్‌ల తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక ట్వీట్..కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక వైసీపీదే..!

YSRCP: 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి విపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. అందులో భాగంగా నేడు, రేపు బెంగళూరులో మరో సారి సమావేశం కావాలని విపక్ష పార్టీలు నిర్ణయించాయి. సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్ సహా 24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం అవుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధినేత్ర సోనియా గాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

YCP MP Vijayasai Reddy Key Comments

 

బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సీఎంలు నితీష్ కుమార్, స్టాలిన్, మమతా బెనర్జీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపునకు విపక్షాలు ఏకం కావడంతో బీజేపీ కూడా తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ క్రమంలో ఎన్డీఏ పక్ష కీలక భేటీకి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 18వ తేదీన ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశానికి 30 పార్టీలకు అహ్వానాలు పంపింది. ఎన్డీఏ పక్ష సమావేశానికి ఏపి నుండి జనసేన పార్టీకి అహ్వానం అందింది. ఎన్డీఏలో చేరాలని టీడీపీ తహతహలాడుతున్నా ఆహ్వానం అందలేదని తెలుస్తొంది. తెలంగాణ, ఏపీలోని ఏ ఇతర పార్టీలకు అటు కాంగ్రెస్ నుండి ఇటు ఎన్డీఏ నుండి అహ్వానాలు అందలేదు.

Vijayasai reddy
Vijayasai reddy

 

ఈ తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 30 పార్టీలతో ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరుగనుండగా, 24 విపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశమవుతున్నాయన్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటునకు వైఎస్ఆర్ సీపీ మద్దతుతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఏపీలో ప్రజల ఆశీర్వాదాలు, ప్రజాదరణ వైఎస్ఆర్ సీపీకే ఉన్నాయన్నారు. జాతీయ మీడియా సహా అన్ని సర్వేలు ఏపిలో వైఎస్ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తాయని అంచనా వేశాయన్నారు. ఇటీవల ఓ జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే రిపోర్టులో 25కి 24 పార్లమెంట్ స్థానాలు వైసీపీ కైవశం చేసుకుంటుందని తెలిపింది. జాతీయ స్థాయిలో మూడవ అతి పెద్ద పార్టీగా వైసీపీ అవతరించనున్నదని చెప్పింది. ఈ స్థాయిలో పార్లమెంట్ స్థానాలు వైసీపీకి వస్తాయన్న అంచనాతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటునకు వైసీపీనే కీలక భూమిక పోషించనున్నదన్నట్లుగా విజయసాయి ట్వీట్ చేశారు.

YSRCP: హాట్ హాట్ గా మారిన రామచంద్రాపురం వైసీపీ రాజకీయం .. చెల్లుబోయిన వర్సెస్ పిల్లి

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju