Vijayasai Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై మరో రెండు కేసుల్లోనూ సీఐడీ పీటీ వారెంట్ పిటిషన్ లను కోర్టులో దాఖలు చేసింది. మరో పక్క ఆయన తనయుడు నారా లోకేష్ పేరును రీసెంట్ గా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ స్కామ్ కేసులో ఏ 14 గా సీఐడీ నమోదు చేసింది. చంద్రబాబును కేసుల నుండి బయటపడేసేందుకు నారా లోకేష్ ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా టీడీపీ రాజకీయాలపై వరుస విమర్శనాత్మక ట్వీట్ లు చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి.. తాజాగా మరో అసక్తికర ట్వీట్ చేశారు. తండ్రీకొడుకుల ఆట ముగిసిందంటూ విమర్శించారు విజయసాయి రెడ్డి. తండ్రి ఎలాగో కొడుకు అలాగే ! ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో నారా లోకేష్ ఏ 14 ని కలవండి. ఢిల్లీలో ఉన్నప్పుడు తనను కలిసే లాయర్ లకు బై వన్ గెట్ వన్ ఫ్రీ స్కీమ్ అందించాలి. తండ్రి కేసును టేకప్ చేయండి..కొడుకు కేసును ఉచితంగా పొందండి. ఈ తండ్రీ కొడుకుల ఆట ఇప్పుడు ముగిసింది అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

ఇటీవల ఏపీలో చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, రాజమండ్రి సెంట్రల్ జైల్ లో భువనేశ్వరి, నారా బ్రహ్మణిలు ములాఖత్ అయి తర్వాత మాట్లాడిన విషయాలపైనా విజయసాయి రెడ్డి విమర్శిస్తూ ట్వీట్ లు చేశారు. చంద్రబాబు గారి కుటుంబ సభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలే రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు అంటూ ఆరోపించారు విజయసాయి రెడ్డి. ఇది వాళ్లకు కొత్తేం కాదు. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

ఆ పార్టీ పునాదులే దోపిడీపై ఎర్పడ్డాయంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. అంతకు ముందు ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదని కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించిన విజయసాయి రెడ్డి..అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు అని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమేనని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.