NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila :టార్గెట్ కేసీఆర్ …. ష‌ర్మిల కొత్త నిర్ణ‌యం ?

YS Sharmila ; Political TS or AP?

YS Sharmila : దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌నయ, తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ షర్మిల త‌న పొలిటిక‌ల్ రీ ఎంట్రీపై పూర్తి స్ప‌ష్ట‌త‌తో ఉన్నట్లుగా క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం నినాదంతో ముందుకు సాగుతున్న ష‌ర్మిల ఈ క్ర‌మంలో వివిధ వ‌ర్గాల‌ను క‌లుస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ అభిమానులతో సమావేశమవుతున్న ఆమె.. ఇప్పుడు యువతపై ఫోకస్ పెట్టారు.

తాజాగా కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ష‌ర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పొలిటికల్ లీడర్‌గా చూడొద్దన్న షర్మిల.. ఓ అక్కగా, సామాన్యురాలిగా మాత్రమే చూడాలన్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

YS Sharmila ; Political TS or AP?

అబ్బే అలా అనుకోవ‌ద్దు అంటున్న ష‌ర్మిల‌ YS Sharmila

మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన షర్మిల.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత వైఎస్ఆర్‌ను గుర్తుచేసిన షర్మిల… ఆయన ప్రజలకు అందించిన పథకాలను ప్రస్తావించారు. దేవుడి దయతో తెలంగాణ వచ్చింది.. తెలంగాణ వచ్చాక ప్రజల సమస్యలు తీరాయా? అమరవీరుల ఆశయాలు నెరవేరాయా? అని సూటిగా ప్రశ్నించారు.. ఉద్యమంలో నేను లేనంత మాత్రాన..

తెలంగాణపై ప్రేమ ఉండదా? అని వ్యాఖ్యానించిన ఆమె.. అమరవీరుల త్యాగాలు స్మరిస్తూ వాళ్ల గడపకు వెళ్లి వస్తానని ప్రకటించారు. త‌న‌ స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ష‌ర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్, విజయశాంతి ఇక్కడి వాళ్లేనా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. జయలలిత కూడా తమిళనాడు వాసి కాదని గుర్తుచేసిన షర్మిల.. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అని అన్నారు.

అన్న‌తో విబేధాలో… బేధాభిప్రాయాలో…

తాను పార్టీ పెట్టడం జగన్‌కు ఇష్టంలేదని పేర్కొన్న వైఎస్ ష‌ర్మిల త‌న‌కు అమ్మ విజయమ్మ మద్దతు ఉందని ప్రకటించారు. వైఎస్ జగన్‌కు నాకు మధ్య విబేధాలో, భిన్నాభిప్రాయాలో తెలియదు అన్నారు. త‌నకు పదవి ఎందుకు ఇవ్వలేదో వైఎస్ జగన్‌నే అడగండి అని వ్యాఖ్యానించారు షర్మిల.. త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందన్నారు షర్మిల.. మే 14 లేక జులై 9 అన్నది మీరు చెప్పాలన్నారు. .. పార్టీ వేరు.. ప్రాంతం వేరైనా.. అన్నాచెల్లెళ్లుగా మేం ఒక్కటే అని పేర్కొన్నారు.

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!