NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్

YSRCP: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నాయకుల్లో అసంతృప్తులు పక్క చూపులు చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత పార్టీలో టికెట్ రాదని భావిస్తున్న నేతలు పార్టీలను వీడుతున్నారు. రీసెంట్ గా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వైసీపీలో చేరేందుకు ఇవేళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

ఇదే క్రమంలో వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ ఎంపీ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వం, కర్నూలు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సంజీవ్ కుమార్ తెలిపారు. విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. కర్నూలు నుండి బళ్లారి వరకూ జాతీయ రహదారి సాధించాలన్నారు.

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తన పరిధిలో ఉన్నంత వరకూ తాను పని చేశానని చెప్పారు. వలసలు ఆగాలంటే పెద్ద స్థాయిలో నిర్ణయాలు జరగాలన్నారు. ఆపాయింట్మెంట్ కోరితే ఎందుకు కష్టపడతావని అంటున్నారన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదనీ, తన సన్నిహితులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. మరో 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉంటానని సంజీవ్ కుమార్ తెలిపారు.

సంజీవ్ కుమార్ గత ఎన్నికల్లో వైసీపీ నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఈ సారి ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే పార్టీ ఆయనకు ఎమ్మిగనూరు స్థానాన్ని ఇవ్వకపోగా, కర్నూలు పార్లమెంట్ ఇన్ చార్జిగా మంత్రి గుమ్మనూరు జయరాం ను నియమించారు. దీంతో ఆయన మనస్థాపానికి గురైయ్యారు. దీంతో సంజీవ్ కుమార్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. కర్నూలు ప్రాంతంలో వైద్యుడుగా మంచి పేరు తెచ్చుకోవడంతో గత ఎన్నికల్లో జగన్ పిలిచి మరీ టికెట్ ఇచ్చారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ జనసేన పార్టీలో చేరతానే ప్రచారం జరుగుతోంది.

YS Jagan – Kesineni Nani: సీఎం వైఎస్ జగన్ తో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ .. పోటీకి కీలక ప్రతిపాదనలు ఇవీ

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju