NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: జగన్ టీమ్ ‘బీ’ రెడీ..జిల్లాల సమన్వయకర్తలు వీరే

YSRCP: ఏపి మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చే క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో భాగంగా పార్టీ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లు, జిల్లా అధ్యక్షులను నియమించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ లు, జిల్లా అధ్యక్షులకు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. విజయసాయి రెడ్డి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ చార్జిగా వ్యవహరిస్తారు. జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్ల వివరాలను సజ్జల వెల్లడించారు.

YSRCP regional coordinators
YSRCP regional coordinators

YSRCP: వైసీపీ జిల్లా అధ్యక్షులు

చిత్తూరు జిల్లా అధ్యక్షుడుగా కేఆర్జే భరత్, అనంతపురం జిల్లా అధ్యక్షుడుగా కాపు రామచంద్రారెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా అద్యక్షుడుగా శంకర నారాయణ, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడుగా గడికోట శ్రీకాంత్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడుగా వై బాలనాగిరెడ్డి, నంద్యాలకు కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లాకు కే సురేష్ బాబు, తిరుపతికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నెల్లూరుకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రకాశంకు బుర్రా మధుసూధన యాదవ్, బాపట్లకు మోపిదేవి వెంకట రమణ, గుంటూరుకు మేకతోటి సుచరిత, పల్నాడుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు వెల్లంపల్లి శ్రీనివాసరావు, కృష్ణాజిల్లాకు పేర్ని వెంకట్రామయ్య (నాని), ఏలూరుకు ఆళ్ల నాని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, తూర్పు గోదావరి జిల్లాకు జగ్గంపూడి రాజ ఇంద్రపందిత్, కాకినాడకు కురసాల కన్నబాబు, కోనసీమకు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, విశాఖకు ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్), ఆనకాపల్లికి కరణం ధర్మశ్రీ, అల్లూరి సీతారామరాజు జిల్లాకు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, పార్వతీపురం మన్యం జిల్లాకు పాముల పుష్ప శ్రీవాణి, విజయనగరం జిల్లాకు చిన్న శ్రీను, శ్రీకాకుళం జిల్లాకు ధర్మాన కృష్ణదాసు లను నియమించారు.

వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ లు

చిత్తూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  కర్నూలు, నంద్యాల జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ జిల్లా, తిరుపతి జిల్లాలకు అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు బాలినేని శ్రీనివాసరెడ్డి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కొడాలి నాని, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు మర్రి రాజశేఖర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు పివి మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డి, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మంత్రి బొత్స సత్యనారాయణలు రీజనల్ కోఆర్డినేటర్ లుగా నియమితులైయ్యారు. కాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అసమ్మతి గళం ఎత్తిన బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలకు పార్టీ పదవులు దక్కగా, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానులకు పార్టీ పదవుల్లోనూ స్థానం దక్కలేదు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju