Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం సెప్టెంబర్ మూడవ తారీకు మొదలైన ఈ షోలో మొత్తం 14 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రెండో రోజు ఎవరికి వారు పరిచయాలతో ఉండగా మూడో రోజు నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో సీజన్ సెవెన్ మొదటి నామినేషన్ లో ఎలిమినేషన్ కి సంబంధించి మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వాళ్ల పేర్లు చూసుకుంటే పల్లవి ప్రశాంత్, రతిక రోజ్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, షకీలా, డామినీ, ప్రిన్స్ యవర్, కిరణ్ రాథోడ్. ఈ 8 మందిలో ఓటింగ్ పరంగా పల్లవి ప్రశాంత్ 36.44% ఓటింగ్ తో అందరికంటే టాప్ లో ఉన్నాడు. యూట్యూబర్ గా తనకంటూ సపరేటు గుర్తింపు దక్కించుకున్న పల్లవి ప్రశాంత్ హౌస్ లో చాలా తెలివైన గేమ్ ఆడుతూ ఉన్నాడు.
తాను రైతు బిడ్డని బిగ్ బాస్ కి వెళ్లడం తన డ్రీమ్ అంటూ.. ఎప్పటికప్పుడు చెప్పుకొస్తూనే ఉన్నాడు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో పలు ప్లాట్ ఫామ్ ల ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. అయితే ఎట్టకేలకు మనోడు అనుకున్నది సాధించి ప్రస్తుతం సీజన్ సెవెన్ లో విజయవంతంగా రాణిస్తున్నాడు.ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ అవ్వడంతో మనోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ బయట క్రియేట్ అయింది. ఇదే సమయంలో మొత్తం మూడు రోజుల ఆటలో హౌస్మెట్స్ ఎక్కువగా.. పల్లవి ప్రశాంత్ గురించే మాట్లాడుతూ ఉండటంతో బయట.. సింపతి పెరిగిపోతోంది. మొదటి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో మనోడు ఉండటంతో భారీ ఎత్తున ఓటింగ్ రాబడుతున్నాడు.
ఏకంగా 35 శాతానికి పైగా ఎక్కువ ఓటింగ్ రాబట్టి టాప్ లోనే ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ తర్వాత రతిక రోజ్ 14.04%, శోభా శెట్టి14.36%, గౌతమ్ కృష్ణ13.15%, షకీలా9.29%, డామినీ6.09%, ప్రిన్స్ యవర్4.53%, కిరణ్ రాథోడ్1.73%.. ఓటింగ్ రాబట్టడం జరిగింది. పల్లె నుంచి వచ్చిన కంటెస్టెంట్ తో పాటు యూట్యూబ్ లోనే ఒక సింపతీలాంటి ఇమేజ్ కలిగిన వ్యక్తి కావడంతో పల్లవి ప్రశాంత్ కి హౌస్ మేట్స్ టార్గెట్ చేయడం చాలా ప్లస్ అవుతూ ఉంది. మరి మొదటి వారంలో ఎనిమిది మందిలో ప్రజెంట్ మాత్రం కిరణ్ రాథోడ్ ఓటింగ్ లో చివరిలో ఉన్నాడు. అయితే ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.