AP Politics: మీకేమైనా అర్ధమవుతుందా..!? రఘురామ వ్యవహారంలో ఇరుక్కుంటున్నది వైసిపినే..!

AP Politics: YSRCP in Trouble in MP Arrest
Share

AP Politics: “అరెస్టు చేశారు. విచారణ చేశారు. కొట్టారని ఆరోపణలొచ్చాయి. కోర్టు ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించమని చెప్పింది. మరో ప్రైవేట్ ఆసుపత్రిలో చెక్ చేసుకోమని చెప్పింది. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు అయ్యాక నేరుగా రిపోర్ట్ జైలుకి ఇచ్చేసారు. కోర్టుకి ఇవ్వలేదు. ప్రైవేట్ ఆరుపత్రికి వెళ్ళలేదు. కోర్టు చెప్పింది చేయలేదు” దీనిలో తప్పు ఎవరిదీ..!? కొట్టారని ఆరోపణలు వచ్చినప్పుడు కొట్టలేదని నిరూపించుకోడానికి అడ్డదారులు ఎంచుకుంటే.. చూసే వాళ్ళు కళ్ళు మూసుకుంటారా..!? మాట్లాడకుండా ఊరుకుంటారా..!? దీనిలో తప్పెవరిది..? మీకేమైనా అర్ధమవుతుందా..!?

“అరెస్టు చేసారు. ఇంటరాగేషన్ లో పోలీసులు కొట్టారని ఆరోపణలు వచ్చాయి. మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సమయానికి ఇవ్వలేదు, పైగా ఒకే ఆసుపత్రి నుండి చెక్ చేయించేసి ఇచ్చారు. తెలిసీ తెలిసీ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు. కొట్టారని ఆరోపించిన వ్యక్తి ఎందుకు ఊరుకుంటారు..? హైకోర్టు తర్వాత సుప్రీమ్ కోర్టు ఉంటుంది గా.. అక్కడకు వెళ్లారు. సుప్రీమ్ వేరే తటస్థ ఆసుపత్రిలో పరీక్షలకు పురమాయించింది. వేరే రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ ని పర్యవేక్షించమని ఆదేశించింది. కొట్టినట్టు తేలితే తప్పెవరిదో తెలుసా..?! ఏం జరుగుతుందో తెలుసా..!? మీకేమైనా అర్ధమవుతుందా.!?

AP Politics: YSRCP in Trouble in MP Arrest
AP Politics: YSRCP in Trouble in MP Arrest

పై రెండు సీన్లు చూస్తే కొంచెం లోకజ్ఞానం, రాజకీయ జ్ఞానం ఉన్న ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఏదో తప్పు జరుగుతుంది అని.. పెద్ద పొరపాటే జరిగింది అని.. ఏదో జరగబోతుంది అని.. సో.. ఈ రెండు సన్నివేశాల్లో ఎవరిది తప్పు..? ఎవరు బాధ్యులు..!? ఎవరికీ శిక్ష..!? ఆ ఫలితాన్ని రాజకీయంగా అనుభవించాల్సింది ఎవరు..!? ఇదే ఒకే ఒక్క పెద్ద ప్రశ్న. మొత్తం రాజకీయమే. ఇది ఒక రాజకీయ వివాదం. ఆ ఎంపీ ఒక రాజకీయ నేత. అతనికి మద్దతుగా పోరాడుతున్నది ఒక రాజకీయ పార్టీ. ప్రభుత్వమూ ఒక రాజకీయ పార్టీనే. దీనిలో తప్పులు తేలితే ఆ ఫలితాన్ని అనుభవించాల్సింది, చవి చూడాల్సింది ప్రభుత్వ పక్షమే..! మీకేమైనా అర్ధమవుతుందా..!? సమాధానం రెడీ చేసుకుంటున్నారా..!?

AP Politics: YSRCP in Trouble in MP Arrest
AP Politics: YSRCP in Trouble in MP Arrest

AP Politics: అరెస్టు నుండీ అన్నీ తప్పులే..!

రఘురాముని అరెస్టు చేయడం వరకు ఒకే. అతను ఎక్కువ మాట్లాడుతున్నారు.. వ్యక్తిగత దూషణలు, కించపరిచేలా మాట్లాడడం.., హోదా మరచి మాట్లాడడం చేస్తున్నారు. అందుకే అరెస్టు చేయడం వరకు ఒకే.. కానీ ఈ కేసులో తర్వాత జరుగుతున్న ప్రతీ అడుగు తప్పుగానే పడుతుంది. అరెస్టు చేసిన తర్వాత ప్రత్యర్ధులు ఊరుకోరు. అనేక అస్త్రాలు వదులుతారు. ఈ ఎంపీ కుటుంబమూ ఊరుకోదు. అన్నిటికీ సిద్ధమై.., అన్నిటికీ విరుగుడు ఆలోచించుకునే ఇటువంటి అరెస్టులు చేయాలి. ముందుకు వెళ్ళాలి. అదేమి లేకుండా అరెస్టు చేసాము. ఇంటరాగేషన్ చేసాము.. మన ఇష్టం వచ్చినట్టు చేసాము. వీడియో తీసాము.. బాస్ కి పంపించాము అంటే చట్టాలు.. కోర్టులు.., మీడియా అనే సంగతి పక్కన పెడితే రాజకీయం ఊరుకోదు. కర్ర కాల్చి వాత పెట్టేస్తాది. ఇప్పుడు కావచ్చు.. తర్వాత కావచ్చు.. ఆ వాతలు దొరకకుండా ఇటువంటి వ్యవహారాన్ని డీల్ చేయడమే కన్నింగ్ రాజకీయం. ఇటువంటి వ్యవహారాల్లో ఆరితేరిన చంద్రబాబు దగ్గర చాలా పాఠాలుంటాయి. “లేదు మా ఇష్టం. మా రాజ్యం. మా వ్యవస్థ అనుకుంటే మొత్తానికి ఒక సమాధానం రెడీ చేసుకుని రంగంలోకి దిగడమే. అప్పుడు ఆ వాతపై నీళ్లు చల్లొచ్చు. ఆ నీళ్లు లేనప్పుడు ఆ వాతకు బలవ్వాల్సిందే. “ఏం ప్రభుత్వ పెద్దోళ్ళు” మీకర్ధమవుతుందా..!?


Share

Related posts

KCR: కేసీఆర్ ప‌రువు బ‌జారు పాలు చేసేందుకు ఇలాంటి వారు చాలు

sridhar

ఉద్యోగాల జాత‌ర … తెలంగాణ‌లో ఇంకో గుడ్ న్యూస్‌

sridhar

YS Jagan : ఏపీ తీరాన గుజరాత్ పాగా..! రాష్ట్రంలో కీలక పోర్టులు అదానీ చేతికి..!!

Srinivas Manem