NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఈ స్టయిల్ లో ఏపీ బీజేపీ ముందుకి వెళితే .. అట్టర్ ప్లాపా – సూపర్ హిట్టా !

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ బిజెపి పేరు గత కొద్ది రోజులుగా మార్మోగిపోతోంది. పార్టీకి నూతన ప్రెసిడెంట్ నియమించిన తర్వాత…. ఏపీ బీజేపీ క్రియాశీలకంగా కీలక అడుగులు వేసింది. అయితే అమరావతి విషయంలో మాత్రం అటు కేంద్ర ప్రభుత్వం అజెండా…. ఇటు రాష్ట్రంలోని పార్టీ తీరు.. కొద్దిగా తికమకపెట్టేలా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం భారతీయ జనతా పార్టీ…. అమరావతి విషయంలో తమకంటూ ఒక ప్లాన్ పెట్టుకుందని…. దానిని అమలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలుస్తోంది. అసలు ఆ ప్లాన్ ఏంటి…. దాని వల్ల ఎవరికి లాభం చేకూరుతుంది…? ఎంతటి నష్టం వాటిల్లుతుంది అన్నది చూద్దాం…

 

చెప్పింది చేసిన సస్పెన్షనే

అమరావతి రైతుల కోసం పోరాడుతామని భారతీయ జనతాపార్టీ ఒకవైపు చెబుతోంది. ఆ రైతుకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నేతలపై మాత్రం సస్పెన్షన్ వేటు వేస్తోంది. ఇదెక్కడి న్యాయం అని అడిగితే.. మాకు పైన నుండి ఆర్డర్ లు అలాగే వస్తున్నాయని కీలక నేతలు ముఖం చాటేస్తున్నారు. గతం లో అమరావతికి మద్దతుగా ఒక పత్రికకు ఆర్టికల్ రాసినందుకు ఓవి రమణ అనే సీనియర్ బిజెపి నేతను రాష్ట్ర శాఖ సస్పెండ్ చేసింది. తాజాగా అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణకు అదే ట్రీట్ మెంట్ ఇచ్చింది. ఆయన చేసిన తప్పేంటి అంటే రాజధాని గ్రామాల్లో రైతులు చేస్తున్న దీక్షలకు హాజరవడం. అక్కడ తాను బీజేపీలో ఉన్నప్పటికీ రైతులకు మద్దతుగా నిలబడలేకపోతున్నందుకు ఆయన ఎంతో చింతించాడు.

ఇంకా అర్థం చేసుకోకపోతే అంతా మూర్ఖులే…

పైకేమో అమరావతి రైతుల మీద సానుభూతి. లోపల చూస్తే ఏమో నమ్మి భూములిచ్చిన ప్రజలకు వెన్నుపోటు అన్నట్లుంది ఏపీ బీజేపీ వ్యవహారం. రైతులకు అండగా ఉండలేకపోతున్నామని వెలగపూడి గోపాలకృష్ణ చెప్పు తో కొట్టుకున్నాడు. రాజధానికి ఏకంగా 34 వేల ఎకరాల సాగు భూమిని త్యాగం చేసిన రైతులు బిజెపి ఆదుకుంటుందని…. కేంద్రంలో పవర్ లో ఉందని అలాగే మిత్రపక్షం టీడీపీతో కలిసి అధికారం సాధించింద భరోసా పెట్టుకున్నారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు ఆయనను సస్పెండ్ చేస్తూ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. అమరావతి మద్దతుగా మాట్లాడితే బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడినట్లే ఆయన సస్పెన్షన్ ఉత్తర్వులు విడుదల కాగా ఇంకా బిజెపికి అమరావతి పై ఉన్న ప్రేమను సరిగ్గా అంచనా వేయాలని ప్రతి ఒక్కరు మూర్ఖులే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీని వల్ల ఏమన్నా లాభం ఉంది అంటారా…?

ఏపీ బిజెపి ప్రదర్శిస్తున్న ఈ వైఖరి వల్ల లాభం ఏముంటుందో…. ఎవరికీ అర్థం కావడం లేదు. అమరావతి ప్రాంతం లేదా ప్రకాశం జిల్లా ని కలుపుకున్నా… మిగతా అన్ని జిల్లాల్లో ఈ క్రెడిట్ అంతా వైసిపి కి వెళ్ళిపోతుంది. టిడిపి ని ఎవరూ పట్టించుకోరు. ఇక అందరూ అనుకున్నట్టే బిజెపి ఏ గాలికి ఆ చాప ఎత్తుతుంది అన్నట్లు ఫిక్స్ అయిపోతారు. అసలే వారు కలిసి ఉంటుందే అత్యంత బలహీనమైన జనసేన తో…. అదీ కాకుండా ఏపీ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో ముఖ్యమైన కృష్ణ మరియు గుంటూరు జిల్లాలో ఇంత వ్యతిరేకతను మూటగట్టుకుంది కాబట్టి. పక్కన జిల్లాల నుండి ఒరిగేది ఏమైనా ఉందా అంటే అదీ లేదు.

అమరావతి మద్దతుగా నిలిచి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు వారి పరిస్థితిపై సానుభూతిని, అవగాహనను కల్పిస్తే ఎంతో కొంత మైలేజ్ దక్కుతుంది…. ఒక కారణం కోసం పోరాటం చేసిన వారు అన్న పేరు కూడా వస్తుంది. కానీ ఇఆల్గే ఉంటే ప్రభుత్వాన్ని తో ఫ్రెండ్షిప్ కోసం ఇలా రైతు పీక కోశారు మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?