NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఒక్క సినిమా! ఒక కృత్రిమ నాయకత్వం..! ఏం సాధించలేం “రాములమ్మ”..!!

nothing there in vijayasanthi political moves

అమ్మానాన్నల నేపథ్యం తూర్పుగోదావరి జిల్లాలో…, పుట్టింది, పెరిగింది చెన్నైలో.., స్థిరపడింది హైదరాబాద్ లో (సినిమాల కోసం మాత్రమే).. కానీ తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా ముద్ర వేసేద్దాం అంటే ఎలా..?

సినిమా డబ్బుని ఇస్తుంది. సినిమా పేరు, ప్రఖ్యాతులను ఇస్తుంది. సినిమా రాజకీయ ప్రవేశాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ సినిమా ప్రాంతీయతని ఇవ్వలేదు. సినిమా నాయకత్వాన్ని ఇవ్వలేదు..! కానీ సినిమా నేపథ్యాన్ని పట్టుకుని తెలంగాణాలో రాజకీయ నేతగా స్థిరపడిపోదాం అంటే ఎలా..!?

నలభై ఏళ్ళ సినీ ప్రయాణం. 185 సినిమాలు.. కానీ ఒకే ఒక్క సినిమాతో తెలంగాణ బిడ్డవయిపోదాం, తెలంగాణాని ఏలేద్దాం అంటే ఎలా..!?

ఈ మూడు ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం దొరికినప్పుడు రాములమ్మ అలియాస్ విజయశాంతి రాజకీయ ప్రస్థానం విజయవంతమైనట్టే. అప్పటి వరకు ఎన్ని పార్టీలు మారినా..? ఊసరవెల్లిలా ఎన్ని సార్లు రంగులు మార్చినా మెడలో కండువాలు.., గొంతు నుండి మాటలు మారుతాయి తప్ప గుండెనిండా అభిమానం నింపుకుని జేజేలు పలికే జనాలు రారు..!

nothing there in vijayasanthi political moves
nothing there in vijayasanthi political moves

ఒక్క సినిమానే కదా తెలంగాణాకి దగ్గర చేసింది..!!

విజయశాంతి కంటే రాములమ్మ అంటేనే ఆమె అందరికీ బాగా తెలుస్తుంది. 185 సినిమాలు చేసిన ఆమెకి, “ఒసేయ్ రాములమ్మ” అంత పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. తెలంగాణ యాస, బాస, బతుకు, పేదరికం, రాజరికం అన్నిటినీ ఆ సినిమాలో చూపించడంతో.. ఆమె నటన కూడా పీక్స్ లో ఉండడంతో ఆమె తెలంగాణకి “కనెక్ట్” అయిపోయారు. ఆ సినిమా వేసిన బంధంతో తెలంగాణ బిడ్డగా మారిపోయారు. బిడ్డగా మారడం సులువే. కానీ నాయకత్వం మాత్రం సులువు కాదు. కృత్రిమంగా, సినిమా వేసిన బంధం ద్వారా వచ్చిన నాయకత్వం కాబట్టి ఆమె అడుగడుగునా విఫలమవుతున్నారు. ఎక్కడా నిలదొక్కుకోలేకపోతున్నారు. చివరికి తనకు రాజకీయ అడుగులు ఇచ్చిన బీజేపీలోకి వెళ్తున్నారు. బీజేపీ బలంగా ఉంది కాబట్టి వెళ్తున్నారు తప్ప.. బీజేపీని బలోపేతం చేయాలని వెళ్లడం లేదు.

పార్టీకి ఆమె ప్లస్సా..? ఆమెకి పార్టీలు ప్లస్సా..!?

మొదట బీజేపీలో కెరీర్ ప్రారంభించారు. బీజేపీ కూడా ఆమెకి పెద్ద పీట వేసింది. 1999 ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై కడపలో పోటీకి నిలబెట్టాలి అనుకుంది. కానీ సోనియానే ఇటు రాలేదు. ఆ తర్వాత తమిళనాడులో స్టార్ ప్రచారకర్తగా మారారు. ఏమైందో ఏమో.. 2004 లో బీజేపీ ప్రాభవం కోల్పోయిన తర్వాత ఈమె సైలెంట్ అయ్యారు. 2009 ఎన్నికలకు ముందు తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. కానీ నాడు టీఆరెస్ బాగా బలంగా ఉండడంతో.., కేసీఆర్ తో కలిసిపోయి టీఆరెస్ లో కలిపేశారు. పార్టీ గాలిలో మెదక్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అక్కడ కేసీఆర్ తో విబేధాలు పెరిగి.., దూరమయ్యారు.


* తెలంగాణ ఇచ్చింది కదా, 2014 లో కాంగ్రెస్ ఇరగదీస్తుంది అనుకుని టీఆరెస్ నుండి కాంగ్రెస్ లో చేరారు. కానీ లెక్క తప్పింది, విజయశాంతి మొహం పగిలింది. కాంగ్రెస్ కూడా ఆమె స్థాయికి దాటిన పెద్ద పీట వేసింది. రాష్ట్ర స్థాయి ప్రచార కమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు ఇచ్చి, హెలికాఫ్టర్ ఇచ్చి రాష్ట్రమంతటా తిప్పింది. నాలుగు ఓట్లు కూడా రాలలేదు. ఆమె అదీ సరిగా నిర్వర్తించలేదు. నాయకత్వం లేక, నడపడం చేతకాక.., ఒక క్యాడర్ ని నిర్మించుకోలేక కాంగ్రెస్ లో ప్రభావం కోల్పోయారు. ఇటీవల టీఆరెస్ లో చేరడానికి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ.., కేసీఆర్ అంగీకరించలేదు. అందుకే ఇప్పుడు బీజేపీకి వెళ్తున్నారు.

చీమ, దోమని కూడా వదలని బీజేపీ..!!

బీజేపీకి ఇప్పుడు ఓట్లు కావాలి. సీట్లు కావాలి. అందుకు ఏ ఒక్కరు చేరినా వారు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణాలో ఖాళీగా ఉంటున్న రాజకీయ నేతలను పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారు. ఆ నాయకుల చరిష్మా, వ్యక్తిగత బలం, రాజకీయ నేపథ్యం, ప్రస్తుత పరిస్థితి బీజేపీకి అనవసరం. వచ్చారా లేదా..? పార్టీలో ఉన్నారా లేదా..? ఓ పది ఓట్లు అయినా కలిసి రాకపోతాయా..? అనే కక్కుర్తితో బీజేపీ ఉంది. అందుకే గల్లీ స్థాయి లీడర్లని కూడా చేర్చేసుకుంటుంది. ఓట్లు ఉండాలి కానీ.. చీమ, దోమకి కూడా మెడలో కండువాలు వేసే పరిస్థితిలో బీజేపీ ఉంది.

ఈ క్రమంలోనే విజయశాంతి కూడా ఏమి అతీతురాలు కాదు. రెండు దశాబ్దాల రాజకీయ నేపథ్యంలో సాధించలేనిది.., ఇప్పుడు, ఇకపైనా విజయశాంతి సాధిస్తారు అనుకోలేం. అంచనా వేయలేం. కాకపోతే ఆమెకు ఒక పార్టీ నీడ కావాలి. సినీ అవకాశాలు లేవు. నేలవారీ ఖర్చులు పెరుగుతున్నాయి. నిర్వహణ కష్టమవుతుంది. ప్రాభవం పోతుంది. రాజకీయ ఉనికి మాయమవుతుంది. ఇలా బీజేపీకి ఎవరైనా కావాలి.. విజయశాంతికి ఒక మంచి పార్టీ కావాలి. ఈ క్రమంలోనే ఈ చేరిక, ఈ కలయిక..!! కొసమెరుపు ఏమిటంటే..? ఆమె వైఫల్యానికి కారణం ఏమిటంటే..!? ఆమె కృత్రిమ నాయకురాలు. ఒక సినిమా ద్వారా మాత్రమే వచ్చిన నాయకత్వం ఆమెది. ఏనాడూ ప్రజా సమస్యలపై పోరాడింది లేదు. ఏనాడూ స్పష్టమైన రాజకీయ అడుగులు వేసింది లేదు. తెలంగాణ ఉద్యమంలో రోడ్డెక్కింది లేదు. అందుకే ఆమె ఎన్ని పార్టీలు మారినా.. ఆమెకు లాభం.., పార్టీలకు భారం తప్ప ఒరిగేదేమి ఉండదు.

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju