NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ బిగ్ స్టోరీ

పోలీసులు వేధించొచ్చా… చట్టం ఎం చెబుతుందో తెలుసా? సలాం కేసులో పాఠాలు

 

 

చట్టం ముందు అంత ఒకటే. అది ఒకరికి తక్కువ కాదు. ఎక్కువ కాదు. దాన్ని సరిగా అర్ధం చేసుకుంటే మనకు దేశం, రాజ్యాంగం గొప్పదనం తెలుస్తుంది. అయితే దాన్ని అమలు చేసే వారిలోని కొన్ని అతి చర్యలు మూలంగా మొత్తం చట్టానికి, దాని విధానానికి తలవంపులు తప్పడం లేదు. ఇదంతా ఎందుకు అంటే కర్నూల్ జిల్లా నంద్యాల లో పొలిసు ఇన్సెపెక్టర్, హెడ్ కానిస్టేబుల్ వేదింపులు తాళలేక అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం, సంచలనమ్ సృష్టించింది. ఈ సంఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యి వెంటనే ఉన్నతాధికారులుచెప్పి సిఐ, హెడ్ కానిస్టేబుల్ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అయితే ఈ కేసులో ఒకరోజు తిరక్కుండానే సిఐ, కానిస్టేబుల్ కు బెయిల్ రావడం మీద ఎప్పుడు అనుమానాలు ముదురుతున్నాయి. వెంటనే దీని మీద హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ వేయాలని చెప్పిన.. అసలు నాన్ బెయిల్బుల్ కేసులో 14 రోజుల జుడీషియారీ రిమాండ్ లేకుండా బెయిల్ ఇవ్వడం పోలీసుల తీరును తప్పు పడుతోంది.

పోలీసులు ఎం చేయాలంటే.?

పోలీసుల విధులు, వారి కర్తవ్యాలు, ఎప్పుడు ఎలా స్పందించాలని అన్ని విషయాలన్నీ పొలిసు మాన్యుల్ బుక్లో పొందుపరిచారు. కానిస్టేబుల్గా ఎంపిక ఐన అందరు దీన్ని చదవడమే కాదు. పొలిసు లకు దీని మీద పరీక్షలు ఉంటాయి. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం మాన్యుల్ బుక్లోని ఒక పాఠం కూడా పోలీసులు పాటించకపోవడం వల్లనే తప్పిదాలు జరుగుతున్నాయి. సలాం లాంటి కేసుల్లో ఇది బయటపడుతోంది.
* పోలీసులు శాంతి భద్రతలు కాపాడుతూ సమాజంలో నేరాలు జరిగే తీరు మీద ద్రుష్టి పెట్టి ప్రజలకు సాయం అందించాలి. ఒకవేళ నేరం జరిగితే సదరు నిందితున్ని కోర్టు ముందు హాజరు పరిచే బాధ్యత మాత్రమే ఉంది. నేరం ఎలా జరిగిందో, ఎవరు చేశారన్న విషయాలను సాక్షాధారాలతో చూపి నిందితుడు ఎవరో న్యాస్థానానికి అప్పగించాలి. న్యాయస్థానాల్లో నిందితుడికి ఇండియన్ పీనల్ కోడ్లో పొందుపరిచే విధంగా శిక్షలు వేసి, జైలు కు పంపుతారు. ఇది క్లుప్తంగా పోలీసుల బాధ్యత.
* అయితే నేరాలు జరిగినపుడు పోలీసుల అతి ప్రవర్తన వాళ్ళ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. లేనిపోని అతికి పోయి కావాలనే కేసుల్లో ఇరుక్కుంటున్నారు. మాన్యుల్ ఫాలో అవుతూ డ్యూటీ చేయలేమని పోలీసులే ఒప్పుకోవడం వింటే, ఇంకా చట్టాలు, పుస్తకాలు ఎందుకో అర్ధం కావు.
* ఒక నేరం జరిగినపుడు నిందితుడికి సైతం కొన్ని ప్రత్యేక హక్కులు ఉంటాయి. న్యాయస్థానానికి నిందితుడిని అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు పోలీసులు అప్పగించాలి. అప్పగించే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి. న్యాయస్థానం ముందు అప్పగించే సమయానికి కేసు లో కీలక విషయాలు బయటకు రాలేదు అనుకుంటే న్యాయస్థానం లో ఒక పిటిషన్ వేసి పొలిసు కస్టడీ కు అడగాలి. దాన్ని న్యాయస్థానం అనుమతి ఇస్తే ఆ మేరకు నడుచుకోవాలి.
* పొలిసు దర్యాప్తులో నిందితుడిని, భయపెట్టడం, శారీరకంగా హింసించి ఒప్పుకునేలా చేయడం లాంటివి పోలీసులు చేస్తే నేరం. సాధారణ పౌరుల మాదిరి కేసులే పోలీసుల మీద పెట్టొచ్చు. న్యాయస్థానంలో నిందితుడు తనను పోలీసులు కొట్టారని చెబితే న్యాయమూర్తులు అలంటి వారిని సస్పెండ్ చేయాలనీ ఆదేశించిన సంఘటనలు ఉన్నాయి.

సలాం కేసులో జరిగింది ఇదే!!

నంద్యాల సలాం కేసులో పోలీసుల అతి వల్లనే అతడు ఒత్తిడికి గురయ్యాడు. గతంలో సలాం బంగారు దుకాణంలో పనిచేసినప్పుడు జరిగిన చోరీ కేసులో సలాం నిందితుడు. ఈ కేసులో ఇప్పటికే జైలు కు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చి, కుటుంబ పోషణ నిమిత్తం ఆటో వేస్తున్నాడు. దొంగతనం కేసులో చితికిపోయి ఉన్న, సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్న సలాం ను పొలిసు స్టేషన్ కు పిలిచి రికవరీ ఇవ్వాలని వేధించడంతోనే విధిలేక, పరువు పోయి ఆత్మహత్య చేసుకున్నాడు.
* ఒక కేసులో సొత్తు పోయినపుడు రికవరీ అనేది పోలీసులు తప్పక చేయాల్సిన పని కాదు. వారి విధి కాదు. సొత్తు పోగుట్టుకున్న బాధితులకు స్వాంతన చేకూర్చే నిమిత్తం దీన్ని పోలీసులు చేస్తారు. ఐతే కొందరు అధికారులు పెద్ద పార్టీల విషయంలో, నేరాలు జరిగినపుడు వారి మెప్పు కోసం, ప్రాపకం కోసం నిందితుల మీద ఒత్తిడి పెంచి మరి వారి సొంత ఆస్తులు అమ్మించి ఐన సొత్తు స్వాధీనం కోసం ప్రయత్నిస్తారు. ఇలాంటి చోట్లే సలాం లాంటి ఎందరో బలి అవుతున్నారు.

author avatar
Special Bureau

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju