NewsOrbit
టెక్నాలజీ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ప్రపంచ కుబేరుడి పోటీ లో అంబానీ ఎక్కడదాకా వెళ్లగలడు? సత్తా ఎంత ?

పుడితే అంబానీ కొడుకుగానే పుట్టాలి“. మా నాన్న ఏమి అంబానీ కాదు“. కష్టాలు లేకుండా హ్యాపీగా బ్రతికేందుకు నేనేమన్నా అంబానీనా?” ఇటువంటి డైలాగులు మన భారతదేశంలో తరచుగా వింటూనే ఉంటాం. అయితే చెప్పిన డైలాగులు అన్నింటిలో అంబానీ అనే బ్రాండ్ కామన్ అయినా కూడా పైన వారు చెప్పినంత సులువుగా అంబానీలలా తయారు కాలేము.. బ్రతకలేము కూడా. కానీ చాలా తేలికగా సహకరించగలం. భారత దేశ ఆర్థిక సామ్రాజ్యాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టగల ముఖేష్ అంబానీ ప్రస్తుతం పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగాడు కానీ ఇక దానిని చేధిస్తాడా లేడా అన్నది ప్రపంచ భవిష్యత్తు భారతమే చెప్పాలి.

Mukesh Ambani world's 7th richest, overtakes Warren Buffet | India ...

అన్నీ రెడీగా ఉన్నాయి….

ఇక అంబానీ నెంబర్ వన్ కాగలడా…. కాలేడా అనే ప్రశ్నలకు ముందు అసలు అంబానీ వద్ద ఉన్న అస్త్రాలు ఏమిటి అన్నది ఒకసారి గమనిస్తే

  1. ట్రెండ్ కి తగ్గట్లు వీడియో కాన్ఫరెన్స్ యాప్ గా జియో మీట్ ను ప్రవేశపెట్టాడు అంబానీ. ఇది ఈస్తోనియా కంపెనీ స్కైప్ మరియు అమెరికా కంపెనీ జూమ్ లకు గట్టి పోటీని ఇస్తోంది.
  2. వాట్సాప్, స్నాప్ చాట్, వి చాట్ లాగా జియోచాట్ తో సోషల్ చాటింగ్ రంగంలోకి ప్రవేశించాడు.
  3. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి పెద్ద సంస్థలు పోటీ గా ఉన్నా సరే జియో మనీతోఒకఅడుగుముందుకువేశాడు
  4. వెబ్ బ్రౌజర్ లలో గూగుల్, ఫైర్ ఫాక్స్, యూసీ బ్రౌజర్ వంటి మేటి సెర్చ్ ఇంజన్ ఇంటర్ఫేస్ ల మధ్య జియో బ్రౌజర్ తో వస్తున్నాడు అంబానీ.
  5. సేవింగ్స్ బ్యాంక్ రంగంలో ఇప్పటికే ఎంతో మంచి పేరు సంపాదించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ లకు చెక్ పెట్టేందుకు జియో పేమెంట్స్ ను సిద్ధంగా ఉంచుకున్నాడు.
  6. జియో టీవీ ప్రస్తుతానికి గూగుల్ ప్లే కి భారతదేశంలో గట్టి పోటీని ఇస్తోంది.
  7. లాజిస్టిక్స్ లో బ్లూ డార్ట్, డిటిడిసి, ఫెడెక్స్ కి దీటుగా రిలయన్స్ లాజిస్టిక్స్ పెట్టేశాడు.
  8. ఇక ఆయిల్ అండ్ గ్యాస్ లో రిలయన్స్ పెట్రోలియం అందవేసిన చేయి.
  9. సోలార్ పవర్ లో దేశీయ టాటా సోలార్ పవర్ పోటీలో ఉన్నా రిలయన్స్ సోలార్ తో గట్టి పోటీ ఇస్తున్నాడు.
  10. రీటైల్ రంగంలో అమెజాన్ పోటీలో ఉండి బిగ్ బజార్ ను కొనుగోలు చేద్దామన్నా…. బిగ్ బజార్ యజమానుల ఫ్యూచర్ గ్రూప్ ను ముఖేష్ అంబానీ కొనేస్తున్నాడు.
  11. ఆన్లైన్ సర్వీస్ లో ప్రజల అలసత్వాన్ని సోమరితనాన్ని సొమ్ము చేసుకునే రిలయన్స్ ఫ్రెష్ ఎప్పుడో ముందుంది.
  12. మ్యూజిక్ స్ట్రీమింగ్ లో జియో సావన్ ప్రస్తుతం టాప్ యాప్స్ లో ఒకటి అని చెప్పాలి.
  13. వీడియో స్ట్రీమింగ్ లో నెట్ఫ్లిక్స్ ,అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ వంటి ప్రీమియమ్ యాప్స్ ను రిలయన్స్ లోనికి తీసుకు వచ్చేసి వాటికి చెక్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Mukesh Ambani ranks 13th in Forbes World's Billionaire list: Here ...

ఇంతకీ భారత్ కి అంబానీ ఏమవుతాడు..? 

ఇక వీటన్నింటినీ పక్కన పెడితే ప్రపంచ ధనవంతుల్లో మొన్నటివరకు 9వ స్థానంలో ఉన్న అంబానీ ఫేస్ బుక్ మరియు అమెజాన్ వంటి సంస్థలు కంపెనీలు షేర్స్ కొనడంతో ఈ రోజు ప్రపంచ ధనవంతుల లిస్టులో 80.5 బిలియన్ డాలర్ల సంపదతో 5వ స్థానానికి చేరుకున్నారు. ఒకానొక సమయంలో ప్రపంచంలోనే అత్యంత ధనికుడు గా వెలుగొందిన అంబానీ ఆ తర్వాత అతి కొద్దికాలమే ఆ స్థానంలో కొనసాగారు. అయితే ఎప్పుడైనా అంబానీని భారత దేశ ప్రజలు తరతరాలు గుర్తు పెట్టుకునేది ప్రపంచ కుబేరుడిగా కాదు…. భారత డిజిటల్ వ్యవస్థను మరియు రూపు రేఖల్ని మార్చేసిన పరోపకారిగా.

 

దశాబ్దాల ‘మేనిప్యులేషన్’ నుండి బయటకు రండి..! 

గట్టిగా మాట్లాడితే గూగుల్ వంటి ప్రపంచ అగ్రగామి సంస్థకు సీఈవోగా సుందర్ పిచ్చాయ్ ను నియమిస్తే అతను మనవాడు అని చంకలు గుద్దుకుంటున్నాం కానీ అతన్ని ఆదర్శంగా తీసుకొని లేదా అతనిలాంటి వారు గూగుల్ లాంటి స్వదేశీ సంస్థలను తయారు చేయలేకపోతున్నారు అన్న నిజాన్ని గ్రహించలేకున్నాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, వాట్సాప్ మరియు మన వాళ్ళను ఆకర్షించే సంస్థలు రాలేకపోతున్నాయి. చైనా వారిలా మన కాళ్ళ మీద మనం మన సొంత సంస్థలతో నిలబడలేకున్నాం.

ఏది ఏమైనా దాదాపు దశాబ్దం కాలం నుండి మనదేశంలో పాశ్చాత్యులు చాలా చాకచక్యంగా పన్నిన పద్మవ్యూహాన్ని చేధించి…. ప్రపంచంలో తనతో పాటు భారత దేశాన్ని కూడా నెంబర్ వన్ స్థానంలో నిలపాలన్న ఆశతో ముఖేష్ అంబానీ ఒక అభిమన్యుడిలా తన వద్ద ఉన్న చిన్న చిన్న అస్త్రాలతో…. పెద్ద ఆశలతో అడ్డంకులను అధిగమించేందుకు సిద్ధమయ్యాడు మరి ఇందులో 130 కోట్లకి పైగా అర్జునులు సహకారం అందిస్తారో లేదో చూడాలి మరి!

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !