అందం పోత పోసినట్టుగా కనిపించే ముద్దుగుమ్మ కృతి శెట్టి ఉప్పెన మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే ఈ అమ్మడు మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముంబై సెటిల్డ్ తుళు కుటుంబంలో పుట్టిన కృతికి చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఈ కన్నడ భామ చిరుప్రాయంలోనే కొన్ని యాడ్ ఫిలిమ్స్‌లో మెరిసింది. హృతిక్ రోషన్ హీరోగా చేసిన ‘సూపర్ థర్టీ’ సినిమా ద్వారా కృతి శెట్టి నటనా ప్రస్థానం మొదలైంది. 17 ఏళ్ల వయసులోనే మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో కలిసి ‘ఉప్పెన’ సినిమాలో నటించింది. ఆ మూవీతో ఆమె సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.
అందాలు చూపిస్తూ మతులు పోగొడుతోంది
ఉప్పెన తరువాత హీరో నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’, నాగచైతన్యతో కలిసి ‘బంగారాజు’ వంటి మూవీలలో నటించింది. ఇవి రెండూ కూడా ఆమెకు హిట్స్ తెచ్చిపెట్టాయి. దీంతో తన సినీ కెరీర్లో కృతి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా దూసుకెళ్తోంది. రామ్ సరసన నటించిన ‘ది వారియర్’ మాత్రం ప్లాప్ అయింది. కృతి నటించిన ఇంకో సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన, శ్యామ్ సింగరాయ్ సినిమాలలో ఎలా గ్లామర్ షో, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయిందో సోషల్ మీడియాలో కూడా అలానే రెచ్చిపోతోంది. తన అందచందాలను చూపిస్తూ కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. అంతేకాదు చీర కట్టులో అందాలలో కూడా ఈ ముద్దుగుమ్మ టర్నింగ్ ట్రెడిషనల్ లుక్‌తో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.
సెగలు పుట్టిస్తున్న ఫొటోలు
తాజాగా ఈ ముద్దుగుమ్మ సిల్వర్ కలర్ శారీలో ఒక ఫొటో షూట్ చేసింది. ఈ లుక్ ను పొడవాటి ఇయర్ రింగ్స్, లూజ్‌గా వదిలేసిన హెయిర్, అట్రాక్టివ్ బ్యాంగిల్స్ తో ఫినిష్ చేసి మరింత అందంగా కనిపించింది. ఈ క్యూట్ యాక్ట్రెస్ శారీకి జతగా బ్లౌజ్ ధరించింది. అలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి యువకులకు సెగలు పుట్టిస్తోందీ అందాల తార. ఈ అమ్మడు మరోసారి నాగచైతన్య సరసన ‘వెంకట్ ప్రభు’ సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంకోపక్క తమిళ్ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!