కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి టెన్ ఇయర్స్… మూడు పదులు దాటిన ఈ బ్యూటీకి కొత్త హీరోయిన్స్ కు ఉన్నంత డిమాండ్ ఉన్నది. సౌత్‌లో అన్ని భాషల్లో సినిమాలు చేస్తు కాల్షీట్స్ అడ్జెస్ట్ చేయాలేనంత బిజీగా మారిపోయింది. ఒకపక్క స్టార్ హీరోలతో, మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తు హిట్స్ కోడుతుంది. అంతేకాదు నయన్ ఓ సినిమా కమిట్ అయిందంటే ఆ సినిమా పక్కా హిట్ అనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది.
సీనియర్ హీరోలకు బెస్ట్ అప్షన్‌గా మారిన నయనతార… కోలీవుడ్, టాలీవుడ్లో వరసగా క్రేజీ ప్రాజెక్ట్ప్ చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో సిద్దమ్మ పాత్రలో నటిస్తున్న నయన్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఎంతపెద్ద స్టార్ సినిమా అయిన సరే ఆ సినిమా ప్రీ రిలీజ్, ఆడియో, విజయోత్సవ ఈవెంట్స్‌కు మాత్రం అంటెండ్ కాదు. కనీసం రిలీజ్‌కు ముందు చిత్రటీమ్తో కలిసి ప్రమోషన్స్‌లో కూడా పాల్గోనదు. రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటున్నప్పటికీ నిర్మాతకు ముందుగానే కండిషన్స్ ఆప్లై చేస్తూ దూరంగా ఉంటుంది. ఆడియన్స్‌లో ఆ సినిమా కంటెంటే మాట్లడుతుందనేది నయన్ అభిప్రాయం. కానీ చిరు కోసం నయన్ తన రూల్స్‌ని పక్కన పెడుతుందట.
సైరా సినిమా కోసం నయన్ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రమోషన్ చాలా అవసరం. ఈ మూవీ ప్రమోషన్లో నయన్ పాల్గొంటే సినిమాకు మరింత ప్లేస్ అవుతుందని భావించిన ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్, నయనతారను ఒప్పించినట్లు సమాచారం. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ఈ ఏడాది చివర్లో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నయనతార ప్రమోషన్ ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి మరి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!